Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

Acharya: చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ’ఆచార్య‘ కొరటాల శివ దర్శకత్వంతో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచానాలు ఉన్నాయి. చిరంజీవితో పాటు మరో క్యారెక్టర్ లో రామ్ చరణ్ తేజ్ నటిస్తుండటంతో భారీ క్రేజ్ నెలకొంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపిస్తుండగా… చెర్రీ పక్కన పూజా హెగ్డే నటిస్తున్నారు. 

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!
Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

2022 ఫిబ్రవరి 4న ఆచార్య సినిమా రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ సిద్దమవుతోంది. సైరా తరువాత చిరంజీవి తీస్తున్న సినిమా కావడంతో ఇందులో కమర్షియల్ అంశాలు తగ్గకుండా… దర్శకుడు కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో దర్శకుడు కొరటాల శివకు కూడా వాటా ఉందని తెలుస్తోంది.

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

దీంతో కొరటాల శివ దగ్గరుండీ మరీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారట. సినిమాకు సంబంధించి ఆర్థిక పరమైన అంశాలను కొరటాల శివే తనపై వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆచార్య సినిమాకు నష్టాలు వస్తే కొరటాల శివ చేతి నుంచి ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్.. మరీ ఈ సినిమా….

అయితే ఇప్పటి వరకు కొరటాల శివ తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు బాక్సాఫీస్ వద్ద దమ్మురేపాయి. తీసిన అన్ని సినిమాలు కూడా పెద్ద హిట్లను సాధించాయి. ప్రస్తుతం ఈ అంశమే కొరటాల శివకు సానుకూలంగా మారనుంది. మెగాస్టార్ ఇమేజ్, కొరటాల ట్రాక్ రికార్డ్ ఆచార్య సినిమాకు ప్లస్ కానున్నాయి. దీంతో సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయనేది వాస్తవం. ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే మాత్రం కలెక్షన్లు దుమ్మురేపుతాయి. ఏది ఏమైనా కొరటాల శివ ఖాతాలో మరో హిట్ పడుతుందో లేదో వేచి చూడాల్సిందే.