Fahadh Faasil: ఫహద్ ఫాజిల్ పుష్ప ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉండటానికి కారణం ఇదే..!
Fahadh Faasil: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ రికార్డుల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో ’పుష్ప ది రైస్‘ మూవీ చేరింది. బన్నీ కెరీర్లో తొలిసారిగా ప్యాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమా విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లో కూడా కలెక్షన్లను బాగానే రాబట్టింది. సినిమా రిలీజ్ కు ముందే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఐటెం సాంగ్ సినిమాపై భారీ అంనాలను పెంచింది.
పుష్ప విడుదలకు ముందు చిత్రయూనిట్ అన్ని భాషల్లో భారీగా ప్రమోషన్లను నిర్వహించింది. హిందీ, తెలుగు, కన్నడ, మళయాళ, తమిళ భాషల్లో విడుదల కావడంతో ఆయా రాష్ట్రాల్లో పుష్ప చిత్ర యూనిట్ ప్రమోషన్లను నిర్వహించింది. అల్లు అర్జున్, రష్మిక చిత్ర ప్రమోషన్లను ముందుండి నడిపించారు. ఇదిలా ఉంటే పుష్పలో మెయిన్ విలన్ ఫహాద్ ఫాజిల్ మాత్రం చిత్ర ప్రమోషన్లలో ఎక్కడా పాలు పంచుకోలేదు.
పుష్ఫ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి మరో కారణం విలన్. మళయాళ స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండటంతో సినిమా క్రేజ్ మరింతగా పెరిగింది. ఫహాద్ కారణంగానే మళయాళంలో కలెక్షన్లు కూడా పెరిగాయి. బన్నీ పుష్ప క్యారెక్టర్ కు విలన్ గా భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫహాద్ ఫాజిల్ కనిపించారు. ఈ సినిమాకు ఫహాద్ భారీ పారితోషకమే తీసుకున్నారు. అయతే పుష్ప సినిమా ప్రమోషన్లలో ఎక్కడా పాల్గొనకపోవడం ఇప్పడు చర్చనీయాంశం అయింది.
సాధారణంగా ఫహాద్ ఫాజిల్ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారు. ఒక వేళ ప్రమోషన్లు చేస్తే రెమ్యునేషన్ పెంచుతాడు ఫహాద్. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగంలో ఫహాద్ క్యారెక్టర్ తక్కువగానే ఉండటంతో ప్రమోషన్లకు దూరంగా ఉన్నారనే వాదన కూడా ఉంది. ’పుష్ప ది రూల్‘ రెండో భాగంలో ఫహాద్ క్యారెక్టర్ నిడివి ఎక్కువని తెలుస్తోంది. పుష్పకు ఛాలెంజ్ విసిరే పాత్రలో ఫహాద్ క్యారెక్టర్ ఉండనుంది. దీంతో పుష్ప రెండో పార్ట్ ప్రమోషన్లలో ఫహాద్ తప్పక పాల్గొంటారని తెలుస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…