Featured

Atcress Debut: 2021లో టాలీవుడ్ కు పరిచయమైన భామలు వీళ్లే.. ఎవరెవరు ఉన్నారంటే..!

Atcress Debut: 2021 సంవత్సరం టాలీవుడ్ కు కొత్తందాలు పరిచయం అయ్యాయి. కొత్తగా వచ్చిన హీరోయిన్లు హిట్లు కొట్టారు. తమ అందం, అభినయంతో ఈ ముద్దు గుమ్మలు తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. అందులో చెప్పుకునే వారిలో ముఖ్యంగా వీళ్లు ఉన్నారు.

ఫరియా అబ్దుల్లా..
’జాతి రత్నాలు‘ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన వారిలో ముందుగా గుర్తుంచుకునే పేరు ఫరియా అబ్దుల్లా. జాతి రత్నాలు సినిమాలో తన అమాయకపు చూపులు, యాక్టింగ్ తో అందర్నిని ఆకట్టుకుంది. జాతి రత్నాలకు సరిజోడిగా నిరూపించుకుంది. ప్రస్తుతం బంగార్రాజు సినిమాలో ప్రత్యేక సాంగ్ లో నటిస్తోంది. 

కృతి శెట్టి ..
’ఉప్పెన‘ బ్యూటీ.. బేబమ్మగా పరిచయం అయిన కృతి శెట్టి తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ పక్కన పర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకుంది. ఈసినిమా హిట్ అయిందో లేదో కృతికి అవకాశాల వెల్లువ ప్రారంభం అయింది. ఇప్పటికే నాని సరసన శ్యాంసింగరాయ్ లో నటించగా.. నాగచైతన్యకు జోడీగా.. బంగార్రాజు మూవీలో మెరవనుంది.

అమ్రిత అయ్యర్..
2021 సినిమాలో పరిచయం అయిన మరో బ్యూటీ అమ్రిత అయ్యర్. రామ్ సరసన ’రెడ్‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తన అమాయకపు నటనతో అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో చేసింది. లేటెస్ట్ గా అర్జున ఫాల్గున సినిమాలో శ్రీ విష్ణు సరసన చేసింది.

ప్రియా ప్రకాష్ వారియర్..
ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో పరిచయం కాకముందే.. తన కను చూపుతో దేశాన్ని తన వైపు తిప్పుకుంది. వింక్ బ్యూటీగా ఫేమస్ అయింది. నితిన్ ’చెక్‘ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ అమ్మడు.. తేజ సజ్జతో కలిసి ఇష్క్ మూవీలో కూడా నటించింది.

శ్రీలీల..
శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా పరిచయం అయిన సినిమా ’పెళ్లి సందD‘ సినిమాలో హీరోయిన్ గా చేసింది శ్రీలీల. తన డ్యాన్స్, అభినయంతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంతో పెళ్లి సందడి రూపొందింది.

కేతికా శర్మ..
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ’రొమాంటిక్ ‘సినిమాలో అంతే రొమాంటిక్ లుక్స్ తో మతిపొగొట్టిన బ్యూటీ కేతికా శర్మ. తన అందంతో కుర్రకారు మదిని దోచుకుంది. నాగ శైర్య లక్ష్య సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది.

శివానీ రాజశేఖర్..
రాజ శేఖర్ తనయగా వెండి తెరకు పరిచయం అయింది శివానీ రాజశేఖర్. అయితే హిందీ సినిమా ’టూ స్టేట్స్’ రిమేక్ తోనే తెలుగు తెరకు పరిచయం కావాాల్స ఉన్నా.. అద్బుతం సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.

తాన్య రవిచంద్ర..
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ సినిమా ’రాజా విక్రమార్క‘ సినిమా ద్వారా తాన్య రవిచంద్ర టాలీవుడ్ కు పరిచయం అయింది. తన నటన, అందంతో అందర్ని ఆకట్టుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

11 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

12 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

12 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

12 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

14 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

15 hours ago