NTR Remuneration: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీగా పెరిగిన ఎన్టీఆర్ మార్కెట్.. ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్?

NTR Remuneration: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీగా పెరిగిన ఎన్టీఆర్ మార్కెట్.. ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్?

NTR Remuneration: ఒకప్పుడు తెలుగు సినిమాలు కేవలం మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే పరిమితమై ప్రేక్షకులను సందడి చేసేవి. క్రమక్రమంగా తెలుగు సినిమాలు దక్షిణాది రాష్ట్రాలలో పలు భాషలలో విడుదల అవుతూ ఆదరణ సంపాదించుకున్నాయి.ఈ విధంగా ఒకానొక సమయంలో అగ్రహీరోలు ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటే అదే పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అని చెప్పాలి.

NTR Remuneration: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీగా పెరిగిన ఎన్టీఆర్ మార్కెట్.. ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్?
NTR Remuneration: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీగా పెరిగిన ఎన్టీఆర్ మార్కెట్.. ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్?

రాజమౌళి పుణ్యమా అంటూ తెలుగు హీరోల మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఈయన తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించారు.అప్పటినుంచి తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఇతర భాషలలో కూడా ఈ సినిమాలపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే కొందరు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా మారిపోయారు.

NTR Remuneration: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీగా పెరిగిన ఎన్టీఆర్ మార్కెట్.. ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్?

ఈ విధంగా పాన్ ఇండియా హీరోగా మారిన కొందరు సెలబ్రెటీల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారు. సుమారు ఒక్కో సినిమాకు 50 కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకోగా ప్రభాస్ అల్లు అర్జున్ వంటి వారు వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇకపోతే వీరి బాటలోనే రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా హీరోగా గుర్తింపు పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మూడు సంవత్సరాల కాల్షీట్స్ ఇచ్చారు.

భారీగా పెరిగిన తెలుగు హీరోల మార్కెట్…

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న కొరటాల సినిమాకు ఏకంగా 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఏది ఏమైనా రాజమౌళి వల్ల మన తెలుగు హీరోల మార్కెట్ పూర్తిగా పెరిగిపోయింది. త్వరలోనే కొరటాల, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది.