Featured

Ayyanna Pathrudu : ఈ వయసులో నేను రేప్ చేయగలనా, హింసించగలనా.. నాపై నిర్భయ కేసు పెట్టారు వైసీపీ వాళ్ళు…!

Ayyanna Pathrudu : టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు సోషల్ మీడియాలో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వాఖ్యలు చేసారు. ప్రస్తుత రాజకీయాల గురించి, జనసేనతో పొత్తుల గురించి ఆయన మాట్లాడారు. ఇక టీడీపీ లో కొంత మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటానికి కారణాలను ఆయన వివరించారు. ఇక ఆయన పై పెడుతున్న కేసులు, మిగిలిన టీడీపీ వాళ్లపైన పెడుతున్న కేసులు, వైసీపీ ఎమ్మెల్యే లు బూతులు మాట్లాడుతున్న తీరుపై వాఖ్యణించారు. విశాఖ రాజధాని అంశం, భూ ఆక్రమణ, కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావడం వంటి విషయాలపై స్పందించారు.

నేను ఈ వయసులో రేప్ చేయగలనా…..

టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు తనపై పెట్టిన నిర్భయ కేసు తదితర కేసులమీద, తన సహచరులపైనా పెట్టిన కేసులపైన మాట్లాడారు. కక్ష్య పూరిత రాజకీయాలు వైసీపీ చేస్తోందని కేసులతో భయపెట్టాలని చూస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా అధికారిని నిలదీసినపుడు పనులు జరగలేదని ఒక సంఘటనలో నాపై నిర్భయ కేసు పెట్టారు. ఆవిడ చేస్తానని మాటిచ్చి వెళ్లిపోయారు. ఆవిడ వెళ్ళిపోయాక జనాలు ఆవిడ వెళ్ళిపోతోంది అంటే మాటిచ్చారు కదా.. అన్నాను అయితే ఒకవేళ చేయకపోతే అని జనాలు అంటే అపుడు ఒకవేళ చేయకపోతే వాళ్లే గుడ్డలుడదీస్తారని అన్నాను. అయితే అప్పటికి ఆవిడ అక్కడ లేరు. ఇక రెండు రోజుల తరువాత అధికార పార్టీ వాళ్ళు నాపై కేసును వాళ్లే డ్రాఫ్ట్ చేసి ఆమెతో సంతకం పెట్టించారు. నేను హై కోర్ట్ లో కేసు వేసానని ఎవరు క్షమాపణలు చెప్పాలో జడ్జిగారు తేలుస్తారంటు వాఖ్యణించారు.

జనసేనతో పొత్తు చర్చలు….

ఇక నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో ఎవరితో పొత్తు ఉండబోతుందనే అంశం మీద మాట్లాడుతూ జనసేనతో పొత్తు గురించి ఆలోచిస్తున్నామని ఇంకా అధికారికంగా చర్చలు జరగలేదని కింది స్థాయి నేతలు ఇరువైపులా పొత్తు ఉండాలని అనుకుంటున్నారని అయ్యన్న చెప్పారు. ఇక చాలా మంది టీడీపీ నేతలు జనసేన పార్టీ వైపుకి చూస్తున్నారని అడుగగా అలాంటిదేమి లేదు అయితే కొంతమంది పొత్తు ఉండొచ్చనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ నుండి గెలిచి మంత్రి పదవి కోసం అలా చేస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక విశాఖ లో జరుగుతున్న భూఆక్రమణ, విజయసాయి కనుసన్నల్లో జరుగుతోంది. ప్రభుత్వ భూములను, సాధారణ జనాల భూములను ఖబ్జా చేస్తున్నారని, రిషికొండను ఎందుకు చదును చేస్తున్నారని అడిగితే కలెక్టర్ దగ్గరే సమాధానం లేదని వాఖ్యణించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago