Jyothi : తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో వాంప్ పాత్రలు చేసిన జ్యోతి మొదట ఎమ్ ఎస్ రెడ్డి గారి దర్శకత్వంలో ‘అందం’ సినిమాతో 18 ఏళ్ల వయసుకే ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. ఇక ఆ పైనా ‘ఓ మై లవ్’ అనే సినిమాలో చేసింది. అయితే గుర్తింపు తెచ్చుకున్న సినిమా మాత్రం ఎస్వి కృష్ణ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘హంగామా’, ఈ సినిమాలో ఆలీకి జంటగా నటించింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కమెడియన్ గాను చాలా సినిమాల్లో నటించింది.
ఏవిఎస్ జోకులకు భజన చేయలేదని….
ఇక ‘తానా’ ఆధ్వర్యంలో జరిగే వేడుకల కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఏవిఎస్ గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళినపుడు గోపాలకృష్ణ గారు, మురళీ మోహన్ గారు ఇంక కొంతమంది బృందంగా వెళ్ళాము, అయితే ఏవిఎస్ గారి గ్రూప్ లో ఉన్న నన్ను ఆయన వేరే వాళ్ళద్దరికి వెళ్లి జ్యోతి కి యాక్టింగ్ రాదూ నా గ్రూప్ లో వద్దని అన్నారట, నేను ఆయన వేసిన కుళ్ళు జోకులకు నవ్వి ఆయనకు భజన చేయకపోవడమే ఇందుకు కారణం అని కామెంట్ చేసింది.
ఇక ఏవిఎస్ గారి ఉదంతం గోపాలకృష్ణ గారికి చెబితే వాడి బొంద నా టీం లో చెయ్ అని చెప్పారట. ఎవరితోనైనా బోల్డ్ గా ఉంటానని, నా పైన కేసు తరువాత చాలా స్ట్రాంగ్ అయ్యానని, ఆ సమయంలో ఎవరు నాకు సహాయం చేయలేదని, అద్దె ఇల్లు కూడా ఖాళీ చేయమనడంతో చిన్నపిల్లాడితో ఇల్లు వెతికినా ఎవరు నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఒప్పుకోలేదని, ఆ నిమిషం ఇదే ఊర్లో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నానని జ్యోతి చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…