Jabardasth Faima: బ్లాక్ మెయిల్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చాను.. నాతో ఫొటోలు దిగడానికి రావడం హ్యాపీగా ఉంది: జబర్దస్త్ ఫైమా
Jabardasth Faima: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అవకాశాలను అందుకోని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి స్థాయిలో ఉన్నారు. ఈ విధంగా జబర్దస్త్ ద్వారా పేరు సంపాదించుకున్న కొందరు కమెడియన్స్ ప్రస్తుతం వెండితెర అవకాశాలను అందుకుని జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరమయ్యారు. ఈ విధంగా జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ ఫైమా ఒకరు.
బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఈమె చేసే కామెడీకి విపరీతమైన అభిమానులు ఉన్నారు. బుల్లెట్ భాస్కర్ టీమ్ ద్వారం విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫైమా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాది చాలా నిరుపేద కుటుంబం అని ఒకప్పుడు మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదని తెలిపారు.
కాలేజీ చదువుతున్న రోజులలో ఒక రోజు మా సార్ కాలేజీ ట్రిప్ అని చెప్పి పటాస్ కార్యక్రమానికి తీసుకువెళ్లారు. ఆ విధంగా పటాస్ కార్యక్రమానికి వచ్చాను.అక్కడ నేను మాట్లాడే యాస, భాష డైరెక్టర్లకు నచ్చడంతో వాళ్లు నాకు ఆఫర్ ఇచ్చారు. అయితే ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెబితే వాళ్ళు ఒప్పుకోలేదు.దీంతో నేను పటాస్ కార్యక్రమానికి వెళ్లకపోతే చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేసి ఈ కార్యక్రమానికి వచ్చాను.
పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. బుల్లెట్ భాస్కర్ అన్న తనకి ప్రతి ఒక్క విషయం ఎంతో వివరంగా చెబుతూ తనని ఎంతగానో ప్రోత్సహించారని ఆమె తెలియజేశారు. అయితే తన ఊర్లోకి ఎవరైనా సెలబ్రిటీలు వస్తే వారితో ఫోటో దిగడం కోసం పరుగులు పెడుతూ వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను ఊర్లోకి వెళ్తే నాతో ఫోటోలు దిగడం కోసం అందరూ వస్తున్నారు. ఈ విధంగా నాతో ఫోటోలు కోసం అందరూ రావడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఫైమా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…