General News

Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..

Air Indian Flight:సాధారణంగా రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్యలో తిరుగుతూ ఓట్ల కోసం పెద్ద ఎత్తున తాపత్రయ పడుతుంటారు. ఇలా ఎన్నికల సమయంలో కాకుండా మిగతా సమయంలో ప్రజలలోకి రావడానికి రాజకీయ నాయకులు పెద్దగా ఆసక్తి కనపరిచరు. అయితే కొంతమంది నేతలు మాత్రం ఇందుకు చాలా భిన్నంగా ఉంటారు. వాళ్లు నిత్యం ప్రజల కోసమే కృషి చేస్తూ.. ప్రజల సమస్యలను తీరుస్తూ నిజమైన ప్రజానాయకుడు గా వ్యవహరిస్తారు.

Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..

తాజాగా కేంద్ర మంత్రి చేసిన పని తెలిస్తే ప్రతి ఒక్కరూ అతనిపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేరు. అసలేం జరిగిందనే విషయానికి వస్తే..శనివారం ఢిల్లీ-ఔరంగాబాద్ ఎయిరిండియా విమానంలో ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలిసిన విమాన సిబ్బంది వెంటనే విమానంలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే స్పందించాల్సి ఉంది అంటూ అనౌన్స్మెంట్ చేశారు. ఈ విధంగా అనౌన్స్మెంట్ విన్న కేంద్ర మంత్రి డాక్టర్ బీకే కరాద్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత డాక్టర్ సుభాష్ భమ్రే వెంటనే స్పందించారు.

Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..

ఈ క్రమంలోనే ఇద్దరు ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని అతనికి చికిత్స అందించారు. ఇలా ప్రాథమిక చికిత్స అందించడంతో ఆ ప్రయాణికుడు త్వరగా ఉపశమనం పొందారు. వీరిద్దరూ ఒకరు కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తుండగా మరొకరు మాజీ మంత్రి ఇలా వీరిద్దరూ రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా వృత్తి పరంగా ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్లు.

ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసిన ఎయిర్ ఇండియా…

ప్రస్తుతం వీరిద్దరూ మంత్రి పదవులలో ఉన్నప్పటికీ ఒక రోగి పట్ల డాక్టర్ గా వ్యవహరించి ఆయనకు చికిత్స అందించడంతో కేంద్ర మంత్రి పై నెటిజన్లు పెద్దఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఎయిర్ ఇండియా ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ వారిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago