Suma Kanakala: సుమ చేతి పై పచ్చబొట్టు.. ఎవరి పేరో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన సుమ..

Suma Kanakala: యాంకర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన సుమ ప్రస్తుతం వెండితెరపై నటిగా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే
విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించిన‌ జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా సుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Suma Kanakala: సుమ చేతి పై ఉన్న పచ్చబొట్టు వెనుక ఉన్న సీక్రెట్ చెప్పిన సినిమా.. ఆ పేరేవరిదో తెలుసా?

ఈ సినిమా మే ఆరో తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సుమ ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి వెల్లడించారు.

Suma Kanakala: సుమ చేతి పై ఉన్న పచ్చబొట్టు వెనుక ఉన్న సీక్రెట్ చెప్పిన సినిమా.. ఆ పేరేవరిదో తెలుసా?

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన చేతి మీద పచ్చబొట్టు పేరు ఎవరిది అనే విషయం గురించి తెలియజేశారు. సుమ తన చేతిపై వెంకన్న అనే పచ్చబొట్టు వేయించుకున్నారు. ఈ పేరు ఎవరిది? ఆ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అని ప్రశ్నించారు.

బిజీబిజీగా సుమ…

ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తన చేతి పై ఉన్న వెంకన్న అనే పేరు ఎవరిది?ఆ పేరు పచ్చ బొట్టుగా ఎందుకు వేయించుకున్నాననే విషయం తెలియాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు సినిమా చూడాలని సుమ చెప్పుకొచ్చారు. ఇకపోతే రాజీవ్ కనకాలతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించగా మంచి కథ దొరికితే తాను రాజీవ్ తో నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.