Suma Kanakala: యాంకర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన సుమ ప్రస్తుతం వెండితెరపై నటిగా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే
విజయ్ కుమార్ దర్శకత్వం వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా సుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా మే ఆరో తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సుమ ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి వెల్లడించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన చేతి మీద పచ్చబొట్టు పేరు ఎవరిది అనే విషయం గురించి తెలియజేశారు. సుమ తన చేతిపై వెంకన్న అనే పచ్చబొట్టు వేయించుకున్నారు. ఈ పేరు ఎవరిది? ఆ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తన చేతి పై ఉన్న వెంకన్న అనే పేరు ఎవరిది?ఆ పేరు పచ్చ బొట్టుగా ఎందుకు వేయించుకున్నాననే విషయం తెలియాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు సినిమా చూడాలని సుమ చెప్పుకొచ్చారు. ఇకపోతే రాజీవ్ కనకాలతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించగా మంచి కథ దొరికితే తాను రాజీవ్ తో నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…