మంచి కొవ్వు పదార్దాలు అంటే ఏంటో తెలుసా?

మారుతున్న కాలానుగుణంగా మన ఆహారపు అలవాట్లలో కూడా మార్పు చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి రోజూ తీసుకునే ఆహారంతో పాటు అదనంగా మన ఆహారంలో మంచి కొవ్వు పదార్దాలు, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండే కొన్ని రకాల పండ్లను, మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. తద్వార మనలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి భవిష్యత్తులో వచ్చే ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. కొవ్వు పదార్ధాలు తీసుకుంటే ఎక్కువ శక్తి అందుతుందని, దాని వల్ల బరువు పెరుగుతామని చాలామంది భావిస్తారు. కానీ మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు కచ్చితంగా ఉండాలి అనేది మరవద్దు.

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో మనకు అవసరమైన క్యాలరీలు దాదాపుగా 20 శాతం కొవ్వు పదార్థాల నుంచి లభిస్తాయి. కొవ్వులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇందులో మంచి కొవ్వులు, చెడు కొవ్వులు. ప్రాసెస్ చేయబడ్డ ఆహారాలు, రిఫైన్డ్, బాక్సుల్లో ప్యాకింగ్ చేసే ఆహారాల్లో హానికరమైన కొవ్వులు ఉంటాయి. అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల వచ్చే వ్యాధి స్థూలకాయం (ఒబేసిటి) శరీరంలో అధికమైన కొవ్వు చర్మంలోని అంతఃశ్చర్మ కణాలైన ఎడిపోజ్ కణాలలో నిల్వ ఉంటుంది. అంతరంగాలలో గుండె మూత్రపిండం, ఊపిరితిత్తుల చుట్టూ చేరుతుంది. ఇది డయాబెటిస్, గుండె వ్యాధులు, జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతుంది.

కొవ్వులు శరీరానికి ప్రధాన శక్తి వనరులు. కండరాలు గట్టి పడేందుకు, రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మంచి కొవ్వులు అవసరం.శరీరంలో ప్రముఖ పాత్ర వహించే విటమిన్ A, D, K, E లు కొవ్వులో కరిగిపోతాయి. వాటిని శరీరం గ్రహించాలంటే శరీరంలో తగిన మోతాదులో కొవ్వులు ఉండాలి ప్రకృతి నుంచి తయారయ్యే సహజమైన ఆహారాల్లో మంచి కొవ్వులు ఉంటాయి.మంచి కొవ్వులు అధికంగా ఒమెగా-3 కొవ్వుల నుంచి లభిస్తాయి.ఫిష్ ఆయిల్స్ , ఫాల్ సీడ్, వాల్‌నట్స్, పచ్చి ఆకు కూరలు, సోయా, గుడ్లు, చేపలు, డార్క్ చాక్లెట్, కొబ్బరి, అవొకాడో వంటివి ఈ కొవ్వులకు మూలాలు.