టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో సమంత అక్కినేని ఒకరు. హీరోయిన్ గా పలు భాషల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత తన 34 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న. ఈ విధంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకొని సెలబ్రిటీ గా రాణిస్తున్న సమంత జీవితాన్ని ఆ ఒక్క సినిమా మార్చేసిందని చెప్పవచ్చు.
సమంత మొట్టమొదటిసారిగా తెలుగులో నాగ చైతన్య సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఏం మాయ చేసావే” సినిమాలో నటించి కుర్రకారులందరిని మాయ చేసింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించే అతన్ని ప్రేమించి, 2017వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో ఒకటై తెలుగింటి కోడలుగా అడుగు పెట్టింది. పెళ్లి కాకముందే ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి మంచి విజయాలను అందుకున్న సమంత పెళ్లి తర్వాత కూడా అదే స్పీడ్ తో దూసుకుపోతోంది.
పెళ్లి తర్వాత కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈమె నటించిన “ది ఫ్యామిలీ మెన్” రెండవ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ తెలిపింది. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత మొట్ట మొదటిసారిగా పౌరాణిక చిత్రమైన “శాకుంతలం” సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతోంది.
కేవలం వెండితెరపై, వెబ్ సిరీస్ లో మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంత మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత ఒక వ్యాపార వేత్తగా కూడా మారారు. సాకీ బ్రాండ్ దుస్తులను ప్రారంభించి మంచి వ్యాపారవేత్తగా కూడా మార్కులు సంపాదించారు. ఈ విధంగా సమంత ఇంతటి క్రేజ్ జీవితానికి కారణం ఏం మాయ చేసావే సినిమా అని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…