మన దేశంలో గత ఏడాది డిసెంబర్లో లాంచ్ అయినఒప్పో ఏ53 5జీకి స్మార్ట్ ఫోన్ తర్వాతి వెర్షన్‌గా ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. కొత్తగా లాంచ్ అయిన ఈ వెర్షన్ మే 2వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్ సెల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ప్రస్తుతం మన దేశంలో లాంచ్ అయినా ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్లలో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,990గా నిర్ణయించగా, మరొక వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రస్తుతం క్రిస్టల్ బ్లూ, ఇంక్ బ్లాక్ రంగులు అందుబాటులో ఉన్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ వెర్షన్ ఫోన్ 6.52 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఇందులో మూడు కెమెరాలు ఉండగా ప్రధాన కెమెరా 13 మెగాపిక్సల్ సెన్సార్ ను అందించారు. 2 మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక సెల్ఫీ కెమెరా 8 మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగి ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…