రూ.15 వేలలోపే ఒప్పో 5జీ ఫోన్ లాంచ్.. సూపర్ ఫీచర్లు ఇవే!

0
218

మన దేశంలో గత ఏడాది డిసెంబర్లో లాంచ్ అయినఒప్పో ఏ53 5జీకి స్మార్ట్ ఫోన్ తర్వాతి వెర్షన్‌గా ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. కొత్తగా లాంచ్ అయిన ఈ వెర్షన్ మే 2వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్ సెల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ప్రస్తుతం మన దేశంలో లాంచ్ అయినా ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్లలో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,990గా నిర్ణయించగా, మరొక వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రస్తుతం క్రిస్టల్ బ్లూ, ఇంక్ బ్లాక్ రంగులు అందుబాటులో ఉన్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ వెర్షన్ ఫోన్ 6.52 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఇందులో మూడు కెమెరాలు ఉండగా ప్రధాన కెమెరా 13 మెగాపిక్సల్ సెన్సార్ ను అందించారు. 2 మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక సెల్ఫీ కెమెరా 8 మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగి ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here