దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు ఛాస్తున్న నేపథ్యంలో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను బలిగొంటోంది. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలో ఏడాది బిడ్డను కరోనా బలితీసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కన్నబిడ్డను కోల్పోవడంతో ఆ తల్లి ఎంతో విలపించింది.
అచ్యుతాపురం మండలం చౌడుపల్లికి చెందిన వీరబాబు సీఐఎస్ఎఫ్‌లో పని చేస్తున్నారు. ఏడాది వయసున్న కూతురు జ్ఞానితకు గత నాలుగు రోజుల క్రితం అధికంగా దగ్గు, జలుబు, జ్వరం రావడంతో సన్ రైస్ ఆసుపత్రిలో చేర్పించారు.దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేసిన పాపకు నయం కాకపోవడంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో మెరుగైన చికిత్స కోసం పాపని మరొక కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు పాపను కేజీహెచ్‌కు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ప్రత్యేక అంబులెన్స్ లో జ్ఞానితను కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రికి చేరుకొని అడ్మిషన్ చేసే లోపు పాప మృత్యువాత పడింది.మూడు రోజుల పాటు చికిత్స అందిస్తూ చివరిక్షణంలో పాప ప్రాణాలను కోల్పోవడంతో ఆస్పత్రి ఆవరణంలో ఆతల్లి రోదన చూసిన కేజీహెచ్‌లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.విశాఖలో కరోనాకు ఏడాది చిన్నారి మృతి..!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…