విశాఖలో కరోనాకు ఏడాది చిన్నారి మృతి..!

0
291

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు ఛాస్తున్న నేపథ్యంలో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను బలిగొంటోంది. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలో ఏడాది బిడ్డను కరోనా బలితీసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కన్నబిడ్డను కోల్పోవడంతో ఆ తల్లి ఎంతో విలపించింది.

అచ్యుతాపురం మండలం చౌడుపల్లికి చెందిన వీరబాబు సీఐఎస్ఎఫ్‌లో పని చేస్తున్నారు. ఏడాది వయసున్న కూతురు జ్ఞానితకు గత నాలుగు రోజుల క్రితం అధికంగా దగ్గు, జలుబు, జ్వరం రావడంతో సన్ రైస్ ఆసుపత్రిలో చేర్పించారు.దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేసిన పాపకు నయం కాకపోవడంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో మెరుగైన చికిత్స కోసం పాపని మరొక కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యులు పాపను కేజీహెచ్‌కు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ప్రత్యేక అంబులెన్స్ లో జ్ఞానితను కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రికి చేరుకొని అడ్మిషన్ చేసే లోపు పాప మృత్యువాత పడింది.మూడు రోజుల పాటు చికిత్స అందిస్తూ చివరిక్షణంలో పాప ప్రాణాలను కోల్పోవడంతో ఆస్పత్రి ఆవరణంలో ఆతల్లి రోదన చూసిన కేజీహెచ్‌లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.విశాఖలో కరోనాకు ఏడాది చిన్నారి మృతి..!