కొన్ని ఆలోచనలు ఆచరణలో పెట్టడం చాలా కష్టం. పట్టుదల ఉంటే అది ఎలాగైనా సాధించవచ్చు. కానీ దానికి కఠోర శ్రమ అవసరం. అలాంటి కఠోర శ్రమ, ఆశయంతో పనిచేసి రాళ్లల్లో స్టూడియోను నిర్మించారు దగ్గుపాటి రామానాయుడు. ఇంతకు విషయం ఏంటంటే.. అప్పల్లో మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రానికి సినిమా పరిశ్రమను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో బంజారాహిల్స్ లోని ఓ స్థలాన్ని అప్పటి సీఎం జలగం వెంగళరావు అక్కినేని నాగేశ్వరరావుకు కేటయించారు.

డి. రామానాయుడును కూడా ఆయన “స్థలం కావాలా?” అని అడిగారు. ఆయన వద్దు అన్నాడంట. ఎందుకంటే అతడికి హైదరాబాద్ వచ్చే ఆలోచన లేదు. అప్పటి వరకు రామానాయుడు విజయా ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి గారి పిల్లలతో కలిసి ఉండటం వల్ల వాహినీ స్టూడియోనే తన స్టూడియో అనుకొని ఆయన సినిమాలు తీస్తూ వచ్చారు. 1976 సంవత్సరంలో డి.రామానాయుడు నిర్మించిన తొలి చత్రం‘సెక్రటరీ’.

ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోలో తీశారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ తీసిన మొదటి సినిమా కూడా సెక్రటరీనే. దీని ప్రారంభానికి వచ్చిన నాగిరెడ్డి.. ఈ కొండల్లో స్టూడియో కడితే బాగుంటుందని రామానాయుడుతో అనడం వల్ల అతనికి అక్కడ స్టూడియో కట్టాలి అనే ఆలోచన మొదలైంది. ఆ తర్వాత భవనం వెంకట్రామ్ సీఎం గా ఉన్న సమయంలో రామానాయుడుకు, సూపర్‌స్టార్ కృష్ణకు ఫిల్మ్‌నగర్‌లో స్థలాలు కేటాయించారు. తర్వాత ఓ రోజు ఎన్టీఆర్ రామానాయుడుకి ఇచ్చిన స్థలం చూసి ‘ ఈ రాళ్లల్లో స్టూడియో ఎం కడతావ్’’ అన్ని అన్నారట. దానికి సమాధానంగా రామానాయుడు వ్యూ బాగుంది అని అన్నారు. “వ్యాపారం చేస్తావా, వ్యూ చూసుకుంటూ కూర్చుంటావా? మంచి స్థలం చూసుకోరాదా..” అని నవ్వారు రామారావు. కానీ అతడు ఇవన్నీ పట్టించుకోలేదు.

అనుకున్నట్లుగానే పని మొదలు పెట్టాడు. ఒక రాయిని పగలగొట్టడానికి ఆరు నెలల సమయం పట్టేసరికి ఆయనలో చాలా నిరాశ కలిగింది. అప్పటికే సురేశ్ ఆయనతో ఉండటం.. వెంకటేశ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడంతో రామానాయుడిలో స్టూడియో కట్టాలనే పట్టుదల ఇంకా పెరిగింది. ఉన్న డబ్బంతా రాళ్లలో పోశారు. వీటిని గమనిస్తున్న పత్రికల వాళ్లు .. మీ ఆశయం ఏంటీ అని అడగ్గా.. ” స్క్రిప్టు తీసుకొని నా స్టూడియోలోకి అడుగుపెట్టిన నిర్మాత.. ప్రింట్ తీసుకుని బయటకు వెళ్లాలి. అన్ని సౌకర్యాలు ఈ స్టూడియోలోనే కలిగించాలన్నదే నా ఆశయం.” అని ఆయన చెప్పుకొచ్చారు. అలా ఆయన ఆశయాన్ని కొన్నాళ్ల తర్వాత తీర్చుకున్నారు.