Connect with us

Featured

Drugs: విశాఖ డ్రగ్స్ లో చంద్రబాబు హస్తం ఉంది.. నిజానిజాలు తేల్చాలి: సజ్జల

Published

on

Drugs: విశాఖ సి పోర్టులో ఓ కంటైనర్ లో సుమారు 25 వేల కేజీల డ్రగ్స్ సిబిఐ అధికారులు సీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక్కసారిగా భారీ మొత్తంలో డ్రగ్స్ అది ఎన్నికల సమయం ముందు అధికారులు సీజ్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఈ డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చాయని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరి నుంచి ఎవరికి పంపిస్తున్నారనే విషయం గురించి సిబిఐ ఆరా తీస్తున్నారు.

ఇలా విశాఖ సీ పోర్టులో డ్రగ్స్ కలకలం సృష్టించడంతో చంద్రబాబు నాయుడు ఇదంతా వైకాపా పనే అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. దీంతో శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేశారు.

డ్రగ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు ఎలా ఉంది అంటే దొంగనే దొంగ దొంగ అని అర్చినట్టూ ఉంది అంటూ ఈయన కామెంట్లు చేశారు. ఇలా విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం వెనుక తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు బిజెపి హస్తము ఉందని ఈయన ఆరోపణలు చేశారు. తప్పు నుంచి బయటపడటం కోసం ఆ తప్పును మేము చేయలేదని నిరూపించుకోవడం కోసమే చంద్రబాబునాయుడు మా పై బురద చల్లుతున్నానని సజ్జల వెల్లడించారు.

Advertisement

25 వేల కిలోల డ్రగ్స్..
విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్‌ను సీజ్‌ చేసింది. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. వ్యవస్థలపై చంద్రబాబు నాయుడుకి గౌరవం లేదని ఆయనది వీధి స్థాయిలో మనస్తత్వం చెలరేగిపోయారు. ఇక ఈ డ్రగ్స్ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉందని అందుకోసం తాము సిబిఐతో పాటు ఈసీ కి కూడా లేఖలు రాస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించడం కోసమే డ్రగ్ సరఫరా జరిగిందని అయితే పట్టుబడటంతో తప్పించుకోవడానికి ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Featured

Pushpa 2: పుష్ప 2 లో చీర కట్టుకొని ఆ పని చేయలేకపోయిన బన్నీ… అదే హైలెట్ అయ్యిందా?

Published

on

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇక ఆస్కార్ అవార్డు టార్గెట్ గా ఈ సీక్వెల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

ఇక పుష్ప సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న సందర్భంగా ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేశారు .ఈ టీజర్ వీడియోలో అల్లు అర్జున్ ఏకంగా అమ్మవారి గెటప్ లో చీర కట్టుకొని ఒక యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నారని వీడియో చూస్తేనే అర్థమవుతుంది.

నటన పరంగా ఎలాంటి కష్టమైనా అనుభవిస్తూ 100% ఆ పాత్రలకు న్యాయం చేసే అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో మాత్రం చీర కట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తుంది. సాధారణంగా చీర కట్టుకొని నడవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ అల్లు అర్జున్ ఏకంగా యాక్షన్ సన్ని వేశాలలో నటించారు.

Advertisement

చీరలో ఫైట్..
ముఖ్యంగా ఈయనకు చీర కట్టుకొని ఫైట్ చేయడం ఎంతో కష్టతరంగా మారిందట కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ కి 100% న్యాయం చేసేలా ఈయన ఎంతో కష్టపడుతూ కేవలం ఈ సీక్వెన్స్ పూర్తి చేయడానికి సుమారు 51 టేకులు తీసుకున్నారని తెలుస్తోంది. ప్రతి సన్నివేశం కూడా స్పష్టంగా రావడం కోసం ఈయన ఇంతగా కష్టపడ్డారట మరోవైపు చీరలో అలవాటు లేకపోవడంతో ఇన్ని టేక్స్ తీసుకున్నారని తెలుస్తోంది అయితే చివరికి ఈ సీన్ చాలా హైలైట్ గా మారబోతుందని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Rakul Preeth Singh: హైదరాబాద్లో మరో బిజినెస్ ప్రారంభించిన రకుల్.. స్పీడ్ పెంచుతున్న నటి!

Published

on

Rakul Preeth Singh: రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు..

బాలీవుడ్ నటుడు నిర్మాత అయినటువంటి జాకీ భగ్నాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి ఈమె పెళ్లి తర్వాత కెరియర్ పై ఫోకస్ పెట్టడమే కాకుండ వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినటువంటి ఈమె జిమ్ ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఎంతోమంది సెలబ్రిటీలు ఈమె జిమ్ కి వెళ్తూ ఉంటారు. ఇలా పలు వ్యాపారాలలో బిజీగా ఉంటూ వ్యాపారవేత్తగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె త్వరలోనే హైదరాబాద్లో మరో వ్యాపారం ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ఇటీవల ఈమె హెల్త్ అండ్ టేస్టీ అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

రెస్టారెంట్ బిజినెస్..
ఈ వీడియో చూసి బహుశా ఈమె రెస్టారెంట్ బిజినెస్ పెట్టబోతున్నారా అని అందరూ ఆ సందేహాలు వ్యక్తం చేశారు అయితే తాజాగా ఈ బిజినెస్ రెస్టారెంట్ బిజినెస్ అని తెలుస్తుంది .హైదరాబాద్ ఆరంభం అనే పేరిట ఈ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారని ఈ రెస్టారెంట్లో కేవలం మిల్లెట్ తో తయారు చేసిన ఫుడ్ మాత్రమే లభించబోతుందని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Kajal Agarwal: దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారిన కాజల్.. అలాంటి కండిషన్లతో షాప్ ఇస్తోందిగా?

Published

on

Kajal Agarwal: వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు.

ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించినటువంటి కాజాల అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత వెంటనే ఈమెకు పిల్లలు కూడా కావడంతో ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించారు ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తున్నారు.

ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే సత్యభామ అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నటువంటి తరుణంలో దర్శక నిర్మాతలకు షాక్ అయ్యే కండిషన్లు పెడుతూ వస్తున్నారు.

Advertisement

రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా..
ఎంతోమంది దర్శకనిర్మాతలు సినిమా అవకాశాలతో కాజల్ ను సంప్రదించగా ఆమె ఎన్నో కండిషన్స్ పెడుతున్నారట. ముఖ్యంగా ఈమె నటించే సన్నివేశాలలో రొమాంటిక్ సన్నివేశాలకు గ్లామర్ కి తావు లేకుండా ఉండాలని కండిషన్ పెడుతున్నారు. ఇక పోతే తాను లిప్ కిస్, బెడ్ రూమ్ సన్నివేశాలలో కూడా నటించనని తేల్చి చెప్పారట అవసరమైతే తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాను కానీ ఇలాంటి సన్నివేశాలలో నటించను అంటూ కాజల్ చెప్పడంతో దర్శక నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!