బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది నిజంగానే శుభవార్త. బంగారం ధరలు గత వారం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. ఈ వారంలో కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర గత నాలుగు సెషన్ల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పతనమైంది

మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్‌లో మంగళవారం కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 57 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధరలురూ.47,405 కు చేరుకుంది. దీనికి గల కారణం డిమాండ్ రేటు తగ్గటం వల్ల ధరలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా డాలర్ రేటు కూడా బలపడటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
గత ఏడాది ఆగస్టు నెలలో బంగారం ధరలు ఆల్టైమ్ రికార్డులు సృష్టించాయి.ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు ఆగస్టు నెలలో ఏకంగా 56,000 గరిష్ట స్థానానికి చేరుకున్నాయి గత ఏడాది ఆగస్టు నుంచి చూస్తే ఈ ఏడాది దాదాపు బంగారం ధరలు 9 వేల వరకు పడిపోయాయి.
ఇక బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోందని చెప్పవచ్చు. గత ఏడాది కిలో వెండి రూ.79,980 స్థాయికి చేరుకుంది ప్రస్తుతం కిలో వెండి ధర రూ.68,600 ఉండటంతో వెండి కూడా దాదాపు పదకొండు వేల రూపాయల వరకు తగ్గినట్లు చెప్పవచ్చు.






























