Covid Vaccination: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ అమలు చేస్తూ ఈ మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ వైరస్ బారిన పడిన ఏ విధమైనటువంటి ప్రమాదం లేకుండా ఉండటం కోసం ఇప్పటికే రెండు డోస్ ల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారు బూస్టర్ డోస్ వేసుకోవడానికి కూడా అర్హులు అని ప్రకటించారు.

ఇలా 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ అందించారు.ఈ క్రమంలోనే 2022 జనవరి నాటికి 15 సంవత్సరాలు పూర్తి నిండిన ప్రతి ఒక్కరికి కూడా కరోనా వ్యాక్సిన్ వేయాలని వీరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
ఈ సంవత్సరాలలో పుట్టిన వారు కూడా అర్హులే…
2005, 2006, 2007 సంవత్సరంలో జన్మించిన వారందరూ కూడా ఈ కేటగిరీ కిందికి వస్తారని, వారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారికి 59% మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేశారు.






























