General News

ఏకంగా 9 వేల పతనమైన బంగారం ధర.. వెండి కూడా అదే రేంజ్‌లో?

బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది నిజంగానే శుభవార్త. బంగారం ధరలు గత వారం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. ఈ వారంలో కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర గత నాలుగు సెషన్ల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పతనమైంది

మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్‌లో మంగళవారం కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 57 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధరలురూ.47,405 కు చేరుకుంది. దీనికి గల కారణం డిమాండ్ రేటు తగ్గటం వల్ల ధరలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా డాలర్ రేటు కూడా బలపడటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

గత ఏడాది ఆగస్టు నెలలో బంగారం ధరలు ఆల్టైమ్ రికార్డులు సృష్టించాయి.ఎంసీఎక్స్ మార్కెట్‌‌లో బంగారం ధరలు ఆగస్టు నెలలో ఏకంగా 56,000 గరిష్ట స్థానానికి చేరుకున్నాయి గత ఏడాది ఆగస్టు నుంచి చూస్తే ఈ ఏడాది దాదాపు బంగారం ధరలు 9 వేల వరకు పడిపోయాయి.

ఇక బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోందని చెప్పవచ్చు. గత ఏడాది కిలో వెండి రూ.79,980 స్థాయికి చేరుకుంది ప్రస్తుతం కిలో వెండి ధర రూ.68,600 ఉండటంతో వెండి కూడా దాదాపు పదకొండు వేల రూపాయల వరకు తగ్గినట్లు చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago