నిరుద్యోగ అభ్యర్థులు ఇండియన్ నేవీ శుభవార్తను తెలియజేసింది.ఇండియన్ నేవీ 2500 సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2021 ఆగస్టు బ్యాచ్ ద్వారా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులను భర్తీ చేయటానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగానికి పురుషులు, అవివాహిత మహిళలు మాత్రమే అర్హులు.
కేవలం ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులుగా ప్రకటించింది. ఇందులో ప్రధానంగా
ఆఫీసర్స్, సెయిలర్స్, సివిలియన్స్ మూడు రకాల పోస్టులు ఉంటాయి.సెయిలర్స్, సివిలియన్స్ పోస్టులకు ఇండియన్ నేవీ విడిగా నోటిఫికేషన్స్ ఇస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2021 ఆగస్టు బ్యాచ్ సెయిలర్స్ ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారక https://www.joinindiannavy.gov.in/వెబ్ సైట్ చూడవచ్చు
ఆర్టిఫిషర్ అప్రెంటీస్– 500 ఖాళీలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి. వీరు 2001 జనవరి 1వ తేదీ నుంచి 2004 డిసెంబర్ 31 మధ్యన పుట్టిన వారే ఉండాలి.
సీనియర్ సెకండరీ రిక్రూట్స్ – 2000 ఖాళీలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.
వీరు కూడా 2001 నుంచి 2004 మధ్య జన్మించి ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన వారు రూ.215 చెల్లించాలి. ఏప్రిల్ 26న ఆన్లైన్ ఈ ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 30 వరకు చివరి తేదీ. ఈ పోస్టుల ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష,ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఎగ్జామ్ వంటి మూడు దశలలో ఎంపిక జరుగుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…