Women Reservation: ఆ మహిళలకు రిజర్వేషన్ ఉండదు..! హైకోర్టు సంచలన తీర్పు..!

Women Reservation: ఆ మహిళలకు రిజర్వేషన్ ఉండదు..! హైకోర్టు సంచలన తీర్పు..!

Women Reservation: రాజస్థాన్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల విషయంలో సంచలన తీర్పును వెలువరించింది. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. సాధారణంగా ఏ రాష్ట్రానికి చెందిన వారు అయినా.. వేరే రాష్ట్రానికి చెందిన మహిళలను పెళ్లి చేసుకుంటే.. ఆమెకు కూడా ఆ రాష్ట్ర రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి.

Women Reservation: ఆ మహిళలకు రిజర్వేషన్ ఉండదు..! హైకోర్టు సంచలన తీర్పు..!
Women Reservation: ఆ మహిళలకు రిజర్వేషన్ ఉండదు..! హైకోర్టు సంచలన తీర్పు..!

అటు విద్యారంగలోగానీ.. ఇటు ఉద్యోగాల్లో గానీ ఆ రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి. కానీ ఇక్కడ రాజస్థాన్ హైకోర్టు మాత్రం దీనిపై సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత రాజస్థాన్ వచ్చే ఇతర రాష్ట్రాల మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ కింద రిజర్వేషన్ ఉండదని తేల్చిచెప్పింది.

Women Reservation: ఆ మహిళలకు రిజర్వేషన్ ఉండదు..! హైకోర్టు సంచలన తీర్పు..!

అయితే ఇక్కడ మరో బెన్ ఫిట్ ను కూడా పొందు పర్చారు. ఏంటంటే.. రిజర్వేషన్లు వర్తించవని చెబుతూ.. ఆయా కోటాల ఆధారణంగా లభించే ఫలాలు మాత్రం అందుతాయని తెలిపింది. సునీత అనే మహిళ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ జరిపి పై విధంగా తీర్పు ఇచ్చింది.

2018, 2020లో కూడా విచారణ..

సునీత అనే మహిళది పంజాబ్ రాష్ట్రం. అక్కడ ఆమె రేగార్ వర్గానికి చెందిన ఎస్సీ కమ్యూనిటీకి చెందింది. ఆమె రాజస్థాన్ వచ్చి పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఆమె ఎస్సీకి సంబంధించి సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకుంది. కానీ అతడు ఆ దరఖాస్తును తిరస్కరించాడు. దీంతో ఆమె రాజస్థాన్ హైకోర్టులో సవాల్ చేయడంతో ఈ విధంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసును విచారించిన జస్టిస్ దినేశ్ మెహతా ఇటువంటి కేసులను 2018, 2020లో కూడా విచారించినట్లు పేర్కొన్నాడు. ఇలా పెళ్లి తర్వాత రాజస్థాన్ లో ఉండే మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కుదరదని తెలిపాడు. కుల ధ్రువీకరణ పత్రం పొందొచ్చని.. కానీ దీనిని ఉద్యోగాల్లో తప్ప మిగిలిన వాటికి ఉపయోగించుకోవచ్చని తీర్పు ఇచ్చాడు.