లావుగా ఉన్నారా.. ఈ ఐదు రకాల పదర్థాలను తీసుకుంటే బరువు తగ్గుతారు..?

వర్షాకాలం అంటేనే వ్యాధులు మొత్తం చుట్టుముడతాయి.అందుకే దీనిని వ్యాధుల కాలం అని కూడా అంటారు. వ్యాధుల ప్రమాదం ఈ కాలంలోనే ఎక్కువ. ఇవి మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీన పరుస్తుంది. ఈ కాలంలో ఆహార నియామాల్లో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఓ వైపు వర్షం.. మరో వైపు వేడి వేడి పకోడి తింటే ఆ అనుభూతే వేరని అనుకుంటారు. వాస్తవానికి వేడి వేడి పకోడీలను ఈ కాలంలో అస్సలు తినకూడదు.

వీటిని ఎక్కువగా తినడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. బరువు పెరగడానికి దారితీస్తుంది. అయితే వర్షాకాలంలో పెరుగుతున్న బరువును నియంత్రించాలంటే ముఖ్యంగా 5 రకాల పదర్థాలను తీసుకుంటే మంచిది. అవేంటంటే.. సమోసాలు, పకోడీలు, బజ్జీలు అనేవి అప్పడప్పుడు తినొచ్చు కానీ.. రెగ్యులర్ గా తింటే మాత్రం ఆరోగ్యానకి హాని చేస్తాయి. సాయంత్రం స్నాక్స్ లో మొక్కజొన్న, పాప్‌కార్న్, పండ్లు తీసుకుంటే మంచిది. వర్షాకాలంలో కూడా నీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని వ్యర్థ పదర్థాలు బయటకు వెళ్లడానికి ఉపయోగపడతాయి.

నీరు, రసం, మూలికా టీలను ఎప్పటికప్పుడు తాగుతూ ఉంటే మీ కడుపు నిండి ఉండిన ఫీలింగ్‌ కలుగుతుంది. సీజనల్ పండ్ల తినడం వల్ల కూడా వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. బెర్రీలు, లిచీలు, స్ట్రాబెర్రీలు, దానిమ్మలు మొదలైనవి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. టీలో అల్లం వేసుకొని తాగితే ఎంతో మంచిది.

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇక ఫైనల్ గా సూప్ తాగడం వల్ల ఆకలి అనిపించదు.. దీంతో బరువు పెరిగే అవకాశం ఉండదు. మొక్కజొన్న, నీరు, బెర్రీలు, అల్లం టీ మరియు సూప్ అనేవి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.