బాలయ్య బాబు సినిమా అంటే నటించడానికి చాలామంది హీరోయిన్స్ ధైర్యం చేసి ముందుకు రారు. ఈ క్రమంలోని బాలయ్య సినిమాలలో హీరోయిన్స్ వెతకాలంటే దర్శకనిర్మాతలకు కత్తిమీద సాము వంటిదని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన నటించడం కోసం శృతి హాసన్ ని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. బాలయ్య సరసన అనగానే శృతిహాసన్ మొదట్లో నో చెప్పినట్లు తెలుస్తోంది. కానీ బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో శృతి హాసన్ నటించబోతోందని తాజా సమాచారం.
గోపీచంద్ దర్శకత్వంలో శృతిహాసన్, రవితేజ హీరోగా తెరకెక్కిన “బలుపు” సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే దర్శకుడు శృతి హాసన్ ని సంప్రదించడంతో ఈ సినిమాలో నటించడం కోసం ఒప్పుకోక తప్పలేదు. అయితే ఈసినిమాలో లీడ్ పెయిర్ గా కాకుండా, మరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ సీనియర్ హీరో కావడం చేత ఆయన పక్కన నటించడానికి ఈ తరం హీరోయిన్లు కాస్త వెనుకడుగు వేస్తారు. అది కాకుండా శృతి హాసన్ ప్రస్తుతం “సలార్” సినిమాతో బిజీగా ఉండటం చేత ఈ సినిమాకి మొదట్లో నో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో గోపిచంద్ బాలకృష్ణ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని కథను తయారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న “అఖండ” సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ గోపీచంద్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…