Movie News

మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి దర్జాగా బయట తిరుగుతున్నాడు.. ఫన్ బకెట్ బర్గవ్ పై మరోసారి చిన్మయి కామెంట్స్..

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు సింగర్ చిన్మయి. మహిళలపై జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే వ్యాఖ్యలు పలు వివాదాలకు కారణమవుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు దారుణంగా ట్రోలింగ్ కి గురవుతుంది. ఇండస్ట్రీలో మహిళలపై జరిగే కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం ఏ స్థాయిలో వివాదం సృష్టించిందో మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సింగర్ లక్నో గర్ల్ ఘటన మీద స్పందించారు.

గత మూడు రోజుల నుంచి నడిరోడ్లో ఒక అమ్మాయి క్యాబ్ డ్రైవర్ ని పట్టుకొని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే నడిరోడ్డు పై జరుగుతున్న ఈ ఘటనను అక్కడ ఉన్నటువంటి వారు, ట్రాఫిక్ పోలీస్ చూసి చూడనట్టు వదిలేశారు.ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సదరు యువతి ధైర్యసాహసాలను ప్రశంసిస్తుంటే మరి కొందరు ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇకపై ఈ వీడియోపై సింగర్ చిన్మయి స్పందించారు. అలా ఎవరి మీద ఎవరు దాడి చేసిన అది తప్పేనని.. ప్రస్తుతం ఆ అమ్మాయి కూడా తప్పు చేసిందని చిన్మయి చెప్పడంతో ఆమె చేసిన పోస్ట్ పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ తో తనని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయికి అబ్బాయికి వస్తున్న మద్దతు గురించి కూడా వివరించారు. గతంలో జొమాటో డెలివరీ బాయ్ కేసులో అందరూ అమ్మాయి నిందించారు. కానీ ఇప్పుడు అబ్బాయి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు.

అదేవిధంగా మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినటువంటి ఫన్ బకెట్ భార్గవ్ అరెస్టయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం అతను ఎంతో దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఇక ఈ లక్నో ఘటనలో కూడా ఎక్కువగా అబ్బాయికి మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలో ఆ అబ్బాయి తన ఉద్యోగాన్ని కోల్పోలేదు కదా.. అంటూ చిన్మయి షాకింగ్ కామెంట్స్ చేయడంతో.. కొందరు ఆమె కామెంట్స్ పై అసభ్యకర పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago