గుడ్డు పెంకులను పడేస్తున్నారా.. అయితే కాస్త ఆగండి.. వాటితో కూడా ప్రయోజనాలున్నాయి తెలుసా?

గుడ్డు అనేది చిన్పపాటి పోషకాహార గని అనే చెప్పాలి. అంతలా అందులో ఆరోగ్యానికి ఉపయోగపడేవి ఉంటాయి. రోజుకు కనీసం ఒక గుడ్డు తినాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరానికి శక్తి రావడమే కాకుండా.. పోషకాలు అందుతాయని అంటున్నారు.

సాధారణంగా ఎవరైనా గుడ్డు పెంకులను తీసేసి.. అందులో ఉన్న తెల్ల, పచ్చ సొనలు తింటుంటారు. కానీ మనం ఎదుకు పనికిరావని పడేసే ఆ పెంకుల వల్ల కడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా గుడ్డు పెంకులను పొడిగా తయారు చేసి ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత అందులో తేనె కలిపి మెత్తగా తయారు చేయాలి.

తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసినట్లయితే.. చర్మం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇలా వీటిని ఫేస్ ప్యాక్ కు ఉపయోగిస్తారు. జట్టు మెరవాలంటే కూడా వీటిని ఉపయోగించవచ్చు. అదెలా అంటే.. పెంకుల పౌడర్ కు పెరుగు కలిపి జట్టుకు అంటించాలి.

తర్వాత స్నానం చేసి ఆర బెడితే మర్పు కనపడుతుంది. గుడ్డు పెంకుల పొడిని టూత్ పేస్ట్ గా కూడా ఉపయోగించవచ్చు. ఆ పౌడర్ లో బేకింగ్ సోడా కలిపి.. కొబ్బరినూనె తో మిక్స్ చేయాలి. ఇలా వారానికి ఒకసారి పళ్లు తోముకోవడం వలన దంతాలు బలంగా తయారు అవ్వడమే కాకుండా మెరుస్తాయి కూడా. మొక్కలు ఎదుగుదలకు గుడ్డు పెంకుల పొడి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇందులో ఉన్న కాల్షియం మొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది.