రన్నింగ్ చేసేటప్పుడు మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలంటే?

సాధారణంగా మహిళలు వారి వస్త్రధారణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా బ్రెస్ట్, యుటెరస్, వజైనా గురించి ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా రన్నింగ్ చేసే మహిళలు ఏ విధమైనటువంటిలో లో దుస్తులను ధరించి రన్నింగ్ చేయడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

  • డిశ్చార్జ్ సహజమే:
    రన్నింగ్ చేసి వచ్చిన మహిళలలో సాధారణంగా డిశ్చార్జ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విధంగా అధికంగా డిశ్చార్జ్ కావడం వల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రన్నింగ్ వంటి హై క్వాలిటీ వర్కౌట్స్ వల్ల డిస్చార్జ్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక రన్నింగ్ వెళ్లేటప్పుడు ప్యాంటీ లైనర్స్ ట్రై చేయవచ్చు.
  • బెస్ట్ సపోర్ట్:
    సాధారణంగా రన్నింగ్ చేసే మహిళల్లో బ్రెస్ట్ మూమెంట్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా లావుగా ఉన్న వారు బ్రెస్ట్ సైజు పెద్దగా ఉండటంవల్ల వారు రన్నింగ్ చేసే సమయంలో ఎంతో అసౌకర్యంగా ఫీలవుతారు. ఈ క్రమంలోనే భుజాలు వంచి లేదా, చేతి మూమెంట్ ని బాగా తగ్గించి రన్నింగ్ చేయడం మొదలు పెడతారు. ఇలా చేయడం వల్ల ఫార్మ్ ని హర్ట్ చేస్తుంది కనుక రన్నింగ్ చేసే మహిళలు హై సపోర్ట్ ఎలిమెంట్ ఉన్న బ్రాలను ధరించాలి.
  • యూరిన్ లీకేజ్:
    పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ గా ఉన్న మహిళలు రన్నింగ్ చేయడం వల్ల ఈ లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి. సాధారణంగా ఈ సమస్య ఎక్కువగా నార్మల్ డెలివరీ అయిన మహిళలు లేదా మోనోపాజ్ దగ్గరగా ఉన్న మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈ విధమైన సమస్యతో బాధపడేవారు రన్నింగ్ వెళ్లేముందు బాత్రూంకి వెళ్లి రావాలి. ఒకవేళ రన్నింగ్ చేసే సమయంలో ఇబ్బంది కలిగితే కాసేపు విరామం తీసుకోవాలి.
  • తొడలు ఒరుసుకుపోవడం:
    రన్నింగ్ చేసే మహిళల్లో అధికంగా తొడలు ఒరుసుకుపోవడంతో పాటు, బ్రెస్ట్, నిపిల్, కూడా వరుసకుపోతాయి. ఈ విధమైన సమస్యలు ఎదుర్కొనే మహిళలు రన్నింగ్ పోయేముందు యాంటీ షేఫింగ్ క్రీమ్ అప్లై చేయాలి. అదేవిధంగా స్నగ్ బాటమ్స్ వేసుకోవడం కూడా ట్రై చేయవచ్చు, దీని వల్ల లేబియా కదలకుండా ఉంటుంది