Pawan Kalyan: ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇంతేనా.. మెగా హీరోలు కూడా పట్టించుకోలేదే?

Pawan Kalyan: సినీ నటుడుగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అయినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. దాదాపు పది సంవత్సరాల క్రితం ఈయన జనసేన పార్టీని స్థాపించారు. ఇలా జనసేన పార్టీని స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన దాఖలాలు లేవు.

ఇకపోతే ఈసారి ఎలాగైనా గెలవాలి అన్ని నేపథ్యంలోనే పొత్తు పెట్టుకుని మరి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా తినే సెలెబ్రిటీలు మొత్తం తరలి వస్తారని అందరూ భావించారు.

అనుకున్న స్థాయిలో మాత్రం సెలబ్రిటీలు పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ తరపున ప్రచార కార్యక్రమాలు చేయలేదు. మెగా హీరోలు అయినటువంటి సాయి ధరం తేజ వైష్ణవ్ వరుణ్ తేజ్ వంటి హీరోలు మాత్రమే వచ్చారు కానీ చిరంజీవి రామ్ చరణ్ బన్నీ వంటి వారు మాత్రం ఈయనకు మద్దతుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించలేదని చెప్పాలి..

జబర్దస్త్ టీం..
చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా కోరారే తప్ప ప్రచార కార్యక్రమాలకు రాలేదు అలాగే పవన్ కు ఎంతో సన్నిహితంగా ఉండే మహేష్ బాబు, ప్రభాస్ ఎన్టీఆర్ వంటి వారు పవన్ కళ్యాణ్ కోసం ఒక్క ట్వీట్ కూడా చేసిన దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ కేవలం జబర్దస్త్ ఆర్టిస్టులతో మాత్రమే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితులను చూసి పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ ఇదేనా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు