బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలిపోవడానికి కారణం ఇదే.. వీడియో వైరల్!

భారత తొలి సీడీఎస్ జనరల్ ఆయన సతీమణితో సహా 13 మంది హెలికాఫ్టర్ ప్రమాదంలో సజీవదహనమైన సంగతి తెలిసిందే. తమిళనాడులో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య ఉన్నారు. ఇలా ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులో కుప్పకూలి పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది అయితే ఈ ప్రమాదం జరగడానికి ఒక క్షణం ముందు ఏం జరిగింది అనే ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తమిళనాడులోని కూనూర్ నీలగిరి హిల్స్ అడవిలో ఓ చెట్టుపై ఈ హెలికాఫ్టర్ కూలింది. అయితే ఈ హెలికాప్టర్ కూలి పోవడానికి క్షణం ముందు ప్రయాణిస్తుండగా కొందరు ఈ వీడియోను చిత్రీకరించారు.అయితే ఈ వీడియో ఆధారంగా ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం వాతావరణంలో మార్పులు మాత్రమేనని తెలుస్తుంది.

ఈ వీడియోలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నట్టు కనిపిస్తోంది.ఇలా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్లే ఈ హెలికాప్టర్ కూలిపోయి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఇలా హెలికాప్టర్ వెళ్తున్న సమయంలో ఆ శబ్దానికి కొందరు అక్కడకు వచ్చి ఈ వీడియోని చిత్రీకరించినట్లు మనం ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియో చిత్రీకరించిన కొన్ని నిమిషాలకే పెద్ద శబ్దంతో ఈ విమానం కూలిపోయింది.మొత్తం 14 మందితో ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్ కెప్టెన్ మినహా మిగిలిన అందరూ ప్రాణాలు కోల్పోగా అతను ఆఖరి క్షణాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు తనని ఆస్పత్రికి తరలించారు.