YS Jagan: జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలంటే .. తనలో ఈ మార్పులు రావాల్సిందే?

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019వ సంవత్సరంలో 151 సీట్లతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు. అయితే ఈయన ఎన్నో సంక్షేమ పథకాలను అందించినప్పటికీ కూడా ఈసారి ఎన్నికలలో మాత్రం కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇలా వైసీపీ ఘోరంగా ఓటమిపాలు కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

ఇక ఈ ఓటమిని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్న పార్టీ అధినేత తప్పులు ఎక్కడ జరిగాయనే విషయాలను ఆరా తీస్తున్నారు. అయితే 2029 ఎన్నికలు జరిగే సమయానికి జగన్ తనలో ఎన్నో మార్పులు చేసుకోవాలని తన ముందు ఉన్న ఈ మూడు వ్యూహాలను అమలు పరిస్తేనే ఆయన వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది.

ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ చాలా కష్టతర పరిస్థితులలో ఉంది. ఈ క్రమంలోనే పార్టీని గ్రామీణ ప్రాంతాల నుంచి బలోపేతం చేయడం ఆయన మొదటి పని. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా కలవకుండా అధికారులతో మాత్రమే సమీక్షలు జరిపిన ఈయన ప్రస్తుతం మాత్రం గ్రామీణ స్థాయి నుంచి కార్యకర్తలను పార్టీ నేతలను బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక ప్రజా వ్యతిరేకత పట్ల కూటమిని ప్రశ్నించాలి ఉద్యమాలు చేపట్టాలంటే ఈయన ప్యాలెస్లు వదిలి పూరి గుడిసెల వద్దకు రావాలి.

జగన్ అధికారంలో ఉన్న ఈ ఐదు సంవత్సరాలు ఆయన వ్యక్తిగతంగా ప్రజలలో భారీ డామేజ్ ఎదుర్కొన్నారు. కేవలం బటన్ల ముఖ్యమంత్రి అని పరదాల ముఖ్యమంత్రి అని, సైకో అనే పేర్లతో ప్రజలలో ఈయనకు ఒక చెడు ముద్ర ఉంది. మీడియా ముందుకు రారనే అపవాదం కూడా ఉంది. ఆ చెడు ముద్రను తొలగించుకోవాల్సిన అవసరం ఉంది.

సంక్షేమం మాత్రమే సరిపోదు..
ఇక సంక్షేమ పథకాలు మాత్రమే అందిస్తే ఓట్లు వేస్తారు అనుకోవడం పూర్తిగా తప్పు ఇలా జగన్ ప్రకటించిన నవరత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. సంక్షేమం అనేది ఒకవైపు మాత్రమే చూడాల్సిన అంశం మరోవైపు అభివృద్ధి కూడా అవసరం కనుక రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల గురించి ఆలోచనలు చేస్తూ ముందడుగులు వేస్తేనే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో విజయం సాధించడానికి సులువైన మార్గం అవుతుందని చెప్పచ్చు.