Revanth Reddy: జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy: 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఘోరమైన ఓటమిని చవి చూసింది. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ ఓటమిపై ఇంకా వైసీపీ అభిమానులు ఈ ఫలితాల నుంచి బయటపడలేకపోతున్నారు.

ఇక జగన్మోహన్ రెడ్డి సైతం ఈ స్థాయిలో ఓటమి ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అయి ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలను తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఆయన ఓటమికి కారణాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలనను విస్మరించారని తెలిపారు. మనం చేసిన పాపాలు మనల్ని మింగుతాయని చెప్పటానికి ఇదే నిదర్శనమని రేవంత్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పై నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఆయనకు 151 సీట్లను ఇచ్చారని తెలిపారు.

జగన్ తప్పు చేశారు..
ఆయన తప్పులు చేయటంతోనే అదే ప్రజలు గద్దె దించారని తెలిపారు. ఇక ఈయన తన ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదని తద్వారా వారంతా ఇతర పార్టీలలోకి వెళ్లి నేడు ఎంపీలుగా మంత్రులుగా కూడా కొనసాగుతున్నారని తెలిపారు. జగన్ నిర్ణయాలతో ఏపీలో పరిశ్రమలు కుప్పకూలాయన్నారు. ఫలితంగా రాష్ట్రం పైన ప్రభావం చూపిందని చెప్పారు. చంద్రబాబు తనకు ఫోన్ చేస్తేనే హైదరాబాద్ లో జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు జరిపించాననే విమర్శల్లో వాస్తవం లేదని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago