ఒకప్పటి ఈ బాలుడు “జాతిరత్నాలు” చిత్రంలో మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించాడని తెలుసా.?!

జాతిరత్నాలు, 2021 మార్చి 11న విడుదలైన తెలుగు కామెడీ సినిమాస్వప్న సినిమా బ్యానరులో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకి అనుదీప్ కెవి దర్శకత్వం వహించాడు. ఇందులో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళి శర్మ, నరేష్ తదితరులు నటించగా, రధన్ సంగీతం అందించాడు. ముగ్గురు హ్యాపీ-గో-లక్కీ యువకుల చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమా మంచి సమీక్షలను అందుకుంది, సినిమాలోని కామెడీతో,ముఖ్య నటుల నటనతో ప్రసంశలు పొందింది. నవీన్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఈ ముగ్గురి త్రయం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

ప్రియదర్శి హైదరాబాదులో జన్మించాడు. తండ్రి పులికొండ సుబ్బాచారి ప్రొఫెసర్. ఈయన కవితలు, పద్యాలు రాసేవాడు. తల్లి జయలక్ష్మి గృహిణి. ప్రియదర్శి హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్స్ లో పి. జి. చేశాడు. ఇతనికి చిన్నతనం నుంచి సినిమాల మీద ఆసక్తి ఉంది. ప్రియదర్శి చెల్లెలు నావికాదళంలో లెఫ్టినెంట్ కమాండర్. ప్రియదర్శి భార్య రిచా నవలా రచయిత్రి. ఈమె స్వస్థలం ఆగ్రా సమీపంలో బృందావనం. ప్రియదర్శి నాన్న ఖమ్మం వాస్తవ్యులు. తల్లి గుంటూరుకు చెందినవారు.

పెళ్లి కాకముందు ప్రియదర్శి వాళ్ల నాన్న సుబ్బాచారి ఒక శుభకార్యం కోసం గుంటూరు వెళ్ళినప్పుడు ప్రియదర్శి వాళ్ళ అమ్మగారిని చూశారు. అలా బంధువుల ప్రోత్బలంతో ఆమెను వివాహం చేసుకున్నారు. హైదరాబాదులో నివాసముంటున్న సమయంలో ఏడాదిన్నర బాబుతో సుబ్బాచారి ప్రియదర్శిని ఎత్తుకొని ఓ ఫోటో దిగారు. కట్ చేస్తే ఆ ఫోటో ఇలా మీ ముందుకు వచ్చింది.