ఆ సినిమాలు చేయడం అంటే గడ్డి తినడమే అని భానుచందర్ ఎందుకు అనాల్సి వచ్చింది.?!

బందర్ కు చెందిన మద్దూరి వేణుగోపాల్ పదవ యేటనే హార్మోనియం వాయించడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ముంబై “స్కూల్ ఆఫ్ మ్యూజిక్” విద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ తీసుకోవడం జరిగింది. అలా అయనకు వేణు మాస్టర్ అని పేరు రావడం జరిగింది. ఆయనకు భార్య శకుంతలాదేవి, మూర్తి చందర్, భానుచందర్ ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఫిలాసఫర్ కాగా చిన్న కుమారుడు భానుచందర్ సినిమా నటుడు అయ్యారు.

భానుచందర్ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాడు. అయితే తల్లిగారు శకుంతలా దేవి భాను చందర్ ని హీరో కావాలని కోరుకుంది. అన్న మూర్తి చందర్ వీడు హీరో ఏమిటి.. నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా అని ఎగతాళి చేశారు. తన తండ్రి వేణు మాస్టర్ అనేక వాయిద్యాలు వాయించడంలో దిట్ట ఒక గిటార్ తప్ప, కావున తండ్రి వాయించలేని గిటార్ ను తను వాయిస్తానని భానుచందర్ గిటార్ వాయించడం నేర్చుకున్నారు. అలా ఆర్.డి.బర్మన్ లాగా మోడరన్ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ముంబై వెళ్లి నౌషాద్ గారి వద్ద ఆరు నెలలు సంగీతపరమైన శిక్షణ తీసుకున్నాడు.

ఆ తర్వాత మద్రాస్ తిరిగివచ్చి తెలుగులో1978 లో మన ఊరి పాండవులు సినిమా లో నటించాడు. ఆ తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు, ఇద్దరు కిలాడీలు, ముక్కుపుడక, తరంగిణి, కూని, గూడచారి నెంబర్ వన్, మెరుపు దాడి, రేచుక్క, లాయర్ సుహాసిని, నిరీక్షణ, సూత్రధారులు, దేవి, సింహాద్రి, దుబాయ్ శీను మొదలగు సినిమాల్లో భానుచందర్ నటించారు.

అయితే ఈమధ్య ఇంటర్వ్యూలో నీకు ఇష్టమైన సినిమాలు ఏంటని అడగగా.. నిరీక్షణ, అశ్విని, స్టువర్టుపురం దొంగలు, సూత్రధారులు అని చెప్పి మిగతా సినిమాలన్నీ గడ్డి తినడం కొరకు మాత్రమే చేశానని భానుచందర్ చెప్పడంతో.. ఆ ఇంటర్వ్యూ చూసిన నటుడు గిరిబాబు చాలా హర్ట్ అయ్యారు. భానుచందర్ కి మంచి బ్రేక్ ఇచ్చిన మెరుపు దాడి చిత్రాన్ని తానే తీశానని అలా గడ్డి తినడానికి మాత్రమే భానుచందర్ చేశానని చెప్పడంతో.. తనకు బాధ కలిగించిందని గిరిబాబు కొద్ది రోజులకు అదే ఇంటర్వ్యూకి హాజరై తన మనసులో మాట చెప్పారు.