TSRTC: విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ షాక్..! వంద కడితేనే బస్ పాస్ రెన్యూవల్..!

TSRTC: విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ షాక్..! వంద కడితేనే బస్ పాస్ రెన్యూవల్..!

TSRTC: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత అనేక వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీకి ఆదరణ పెరిగేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థులపై భారం మోపేలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బస్ పాస్ రెన్యూవల్ కు 20 రోజుల గడువు ముగిస్తే ప్రతీ విద్యార్థిపై రూ. 100 పెనాల్టీగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. 

TSRTC: విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ షాక్..! వంద కడితేనే బస్ పాస్ రెన్యూవల్..!
TSRTC: విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ షాక్..! వంద కడితేనే బస్ పాస్ రెన్యూవల్..!

కరోనా కారణంగా గతేడాది విద్యాలయాలు పెద్దగా నడవలేదు. సెప్టెంబర్ 1నుంచి తరగుతులు ప్రారంభం కావడం వల్ల విద్యార్థులంగా బడి బాట పట్టారు. కాగా ఇటీవల థర్డ్ వేవ్ సందర్భంగా సంక్రాంతి సెలవులను గత నెల 8 నుంచి 30 వరకు విద్యాసంస్థలు మూసివేశారు. దీంతో 24 రోజులు కాలేజీలు, స్కూళ్లు మూతపడ్డాయి.

TSRTC: విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ షాక్..! వంద కడితేనే బస్ పాస్ రెన్యూవల్..!

అయితే దాదాపు 20 రోజుల కన్నా ఎక్కువగా సెలవులు దాటడంతో.. బస్ పాస్ ల రెన్యూవల్ కోసం ఇబ్బంది పడుతున్నారు. అదనంగా రూ. 100 చెల్లించడం విద్యార్థులకు కష్టంగా మారింది. ఒక్కక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బస్ పాస్ కలిగిన విద్యార్థులు 2 లక్షల మంది వరకు ఉన్నారు. 

ఒక్క వేసవి సెలవుల్లో మాత్రమే..

చాలా మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారు. ఇందులో నిరుపేదలే ఎక్కువ. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులే.. బస్ పాసులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో అదనంగా రూ. 100 చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ మాత్రం ఇది కొత్తగా పెట్టిన నిబంధన కాదని అంటుంది. అయితే గతంలో ఒక్క వేసవి సెలవుల్లో మాత్రమే.. 20 రోజుల కన్నా మించి సెలవులు వచ్చేవి. అయితే కరోనా పుణ్యమా అని.. ఇప్పుడు విద్యాలయాలు ఎప్పుడు ఉంటాయో ఉండవో తెలియని పరిస్తితి ఉంది. ప్రస్తుతం ఈ వివాదంపై విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఆర్టీసీ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.