Focus Movie: వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైన ఫోకస్ స్పెషల్ పోస్టర్.. పోస్టర్ వైరల్!
Focus Movie: బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అషు రెడ్డి ఫోకస్ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు. విజయ్ శంకర్ హీరోగా అషు రెడ్డి హీరోయిన్ గా సూర్య తేజ దర్శకత్వంలో స్కైరా క్రియేషన్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.
ఇక నేడు వాలెంటెన్స్ డే కావడంతో వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేడు చిత్రబృందం విడుదల చేసిన ఈ పోస్టర్ ఫర్ఫెక్ట్ వాలెంటైన్స్ డే స్పెషల్ అని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో విజయ్ శంకర్ అషు రెడ్డి ఒకరినొకరు హగ్ చేసుకొని నవ్వుతూ కనిపించారు. మర్డర్ మిస్టరీతో ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.
ఈ సినిమాలో విజయ్ శంకర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా సుహాసిని మణిరత్నం జడ్జి పాత్రలో కనిపించనున్నారు. భానుచందర్, షియాజీ షిండే, జీవా, భరత్ రెడ్డి సూర్య భగవాన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సూర్యతేజ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. సత్య. జీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…