శ్రుతి హాసన్ తల్లి సారిక ఇంట్లోంచి పారిపోయి.. ఆరు రోజులు కారులోనే ఎందుకు ఉండిపోయారో తెలుసా?

విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన “హే రాం” సినిమాలో బాల్యనటిగా నటించి తన తండ్రికి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకున్నారు. ధనుష్ సరసన 3 సినిమాలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలనందుకున్న తర్వాత శ్రుతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన “గబ్బర్ సింగ్” సినిమాలో నటించింది.

ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది. ఇదిలా ఉండగా.. కమల్ హాసన్ కు మాజీ భార్య సారిక ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను ఓసారి చూస్తే న‌మ్మ‌లేని నిజాలు మ‌న‌కు కొన్ని క‌నిపిస్తాయి.

సారిక ఢిల్లీలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మరాఠీ, రాజపుత్ర వంశాలకు చెందినవారు. సారిక చిన్నతనంలోనే ఆమె తండ్రి వారి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దానితో కుటుంబాన్ని పోషించేందుకు ఆమె పని చేయక తప్పలేదు. ఆమె అసలు పాఠశాలకే వెళ్ళలేదు.

ఎప్పుడు చూసినా ఫిల్మ్ స్టూడియోల చుట్టూ తిరుగుతూ చ‌క్క‌ర్లు కొడుతూ వ‌చ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండకపోయేది. ఆమె దాదాపు 21 ఏళ్ల వయస్సులో ఆమె ఇంటిని విడిచి వెళ్లి పోయింది. ఆమెకు ఏం చేయాలో తెలియక.. అలానే ఆలోచిస్తూ తన కారులోనే ఆరు రోజులు ఉన్నారట. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇలా ఆమె మొదటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట.

ఆమె 28 ఏళ్ల వయసులో హీరో కమల్ హాసన్‌ను పెళ్లి చేసుకుని పూర్తిగా నటనను వదలిపెట్టారు. ఆ తరువాత 43 ఏళ్ల వయసులో కమల్ తో విడిపోయి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ముంబైకి వెళ్లిపోయి.. పెళ్ళికి ముందు వదిలేసిన తన నటనను తిరిగి మొదలుపెట్టింది.