నటుడు ప్రకాష్ రాజ్ కు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో జీవించేస్తాడు. అంతలా అందులో ఒదిగిపోయి నటించేంత సమర్ధుడు. ప్రస్తుతం అతడు నటుడిగా, దర్శకుడు, నిర్మాతగా సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. తాజాగా జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలో కూడా పోటీ చేయనున్నాని ప్రకటించాడు.
అయితే ప్రశాష్ రాజ్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. అతడు ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించాడు. ఈ రోజు వరకు అతడు నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. డ్యుయెట్ సినిమా అతడికి మంచి గుర్తింపును తెచ్చింది. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు.
కాంచీవరం చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. ఐదు సార్లు ఫిల్మ్‌ఫేర్ పురస్కారం, ఆరు సార్లు నంది పురస్కారం, తమిళ నాడు రాష్ట్ర పురస్కారాలు, విజయ అవార్డు మూడు సార్లు అందుకున్నాడు. ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26 న జన్మించాడు. ప్రకాష్ రాజ్ లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు.
ఆమె డిస్కో శాంతికి సోదరి. అంటే నటుడు శ్రీహరి, ప్రకాష్ రాజ్ లు తోడు అల్లుళ్లు అన్నమాట. రియల్ స్టార్ శ్రీహరి భార్య శాంతకుమారి అలియాస్ డిస్కోశాంతి అన్న విషయం అందరికీ తెలిసిందే. లలిత కుమారి, డిస్కోశాంతి అక్కాచెల్లెళ్లు.
2009 లో వాళ్లిద్దరి మధ్య కలతలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతము బాలీవుడ్ కు చెందిన నాట్యకారిణి పోనీ వర్మ ను ఆగస్టు 2010 లో రెండో వివాహము చేసుకున్నాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…