ఎన్-95 మాస్కుల వాడండి.. కరోనాను తరిమికొట్టండి!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం మాస్క్ ధరించడమే. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మొదటగా మాస్కులు ధరించడం, శానిటైజర్ లు, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అని నిపుణులు తెలియజేస్తున్నారు.

రెండవ దశ కరోనా వైరస్ వేగవంతంగా వ్యాపించడంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించడం ఎంతో ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరిలో మాత్రం ఎటువంటి మాస్క్ లను ఉపయోగించడం వల్ల వైరస్ నుంచి పూర్తి రక్షణ కలుగుతుందనే సందేహాలు తలెత్తుతున్నాయి.

వైరస్ నుంచి ఎక్కువ శాతం రక్షణ పొందటానికి అమెరికా సీడీసీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ సంయుక్త ప్రమాణాల మేరకు తయారవుతున్న ఎన్‌ 95 మాస్క్‌లు కరోనా మహమ్మారి నుంచి 95 శాతం మనకు రక్షణ కల్పిస్తాయని , ‘పేషెంట్‌ నో హౌ డాట్‌కామ్‌’ వ్యవస్థాపకుడు దేవభక్తుని శ్రీకృష్ణ, తెలిపారు.

బట్టతో తయారు చేసిన మాస్క్ లను పెట్టుకోవడం వల్ల మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశిస్తాయి. బట్టతో తయారు చేసిన మాస్కులు కేవలం 20 శాతం మాత్రమే సూక్ష్మ క్రిములను లోపలికి వెళ్లకుండా నిలువరించగలవు. కానీ
ఎన్‌ 95 మాస్క్‌లు మాత్రం వైరస్ నుంచి 95 శాతం రక్షణ పొందే విధంగా తయారు చేస్తారు కనుక వైరస్ నుంచి రక్షణ పొందటానికి n-95 ఎంతో ఉత్తమమని దేవభక్తిని శ్రీ కృష్ణ తెలిపారు. అయితే n-95 అందరికీ అందుబాటులో లేని పక్షంలో డబుల్ మాస్క్ లను ధరించాలని, సూచించారు.