ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం మాస్క్ ధరించడమే. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మొదటగా మాస్కులు ధరించడం, శానిటైజర్ లు, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అని నిపుణులు తెలియజేస్తున్నారు.
రెండవ దశ కరోనా వైరస్ వేగవంతంగా వ్యాపించడంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించడం ఎంతో ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరిలో మాత్రం ఎటువంటి మాస్క్ లను ఉపయోగించడం వల్ల వైరస్ నుంచి పూర్తి రక్షణ కలుగుతుందనే సందేహాలు తలెత్తుతున్నాయి.
వైరస్ నుంచి ఎక్కువ శాతం రక్షణ పొందటానికి అమెరికా సీడీసీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంయుక్త ప్రమాణాల మేరకు తయారవుతున్న ఎన్ 95 మాస్క్‌లు కరోనా మహమ్మారి నుంచి 95 శాతం మనకు రక్షణ కల్పిస్తాయని , ‘పేషెంట్ నో హౌ డాట్‌కామ్’ వ్యవస్థాపకుడు దేవభక్తుని శ్రీకృష్ణ, తెలిపారు.
బట్టతో తయారు చేసిన మాస్క్ లను పెట్టుకోవడం వల్ల మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశిస్తాయి. బట్టతో తయారు చేసిన మాస్కులు కేవలం 20 శాతం మాత్రమే సూక్ష్మ క్రిములను లోపలికి వెళ్లకుండా నిలువరించగలవు. కానీ
ఎన్ 95 మాస్క్‌లు మాత్రం వైరస్ నుంచి 95 శాతం రక్షణ పొందే విధంగా తయారు చేస్తారు కనుక వైరస్ నుంచి రక్షణ పొందటానికి n-95 ఎంతో ఉత్తమమని దేవభక్తిని శ్రీ కృష్ణ తెలిపారు. అయితే n-95 అందరికీ అందుబాటులో లేని పక్షంలో డబుల్ మాస్క్ లను ధరించాలని, సూచించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…