అంజి మిస్సింగ్.. టెన్షన్ లో మోనిత.. ఏసీపీ రోషినితో దీప పక్కా ప్లాన్?

బుల్లితెరపై ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1101 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్స్ ఏంటో చూద్దాం… ఆనందరావు గుండెపోటుతో ఆస్పత్రిలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మోనిత హాస్పిటల్ లోకి స్పీడ్ గా దూసుకు వస్తుంది. ఆనందరావు రూమ్ బయట దీప పేపర్ చదువుతూ ఉంటుంది. మోనితను చూసిన దీప ఎక్కడికి అని అడుగుతుంది. దీంతో మామయ్య గారిని చూడటానికి.. అదే మీ మామగారిని చూసి పోదామని కార్తీక్ ఫ్రెండ్ గా వచ్చానని చెబుతుంది. ఇప్పుడు మా ఆయనకు మోనిత అనే ఫ్రెండ్ లేదు. అవును కాబోయే భార్య ఉందని మోనిత వెటకారంగా సమాధానం చెబుతుంది.

ఇంతలో అక్కడికి ఒక నర్స్ వచ్చి నమస్తే మేడమ్ అంటూ మోనితకి నమస్కారం చెబుతుంది. ఇప్పుడు కార్తీక్ వాళ్ళ డాడీకి ఎలా ఉంది? అని అడగడంతో స్టెంట్ వేశారు మేడం.. ఆయన కార్తీక్ సార్ తో ట్రీట్మెంట్ చేయించకోకపోతే డాక్టర్ గోవర్ధన్ వచ్చి ట్రీట్మెంట్ చేశారని చెబుతుంది. ఎందుకు మేడం కార్తీక్ సార్ మీద ఆయన చాలా కోపంగా ఉన్నారని నర్స్ అడగటంతో… కార్తీక్ నన్ను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అందుకే అతనికి కోపంగా ఉన్నాడు అని చెప్పడంతో నర్స్ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. దీంతో చూసావా దీప.. సమాజం ఎలా ఉంటుందో.. ఇప్పుటికైనా ఒప్పుకో ఎవరు నన్ను తప్పు పట్టారు అనడంతో.. అవును రేపు అంజి ఇక్కడికి వచ్చి నీ గురించి చెప్పినప్పుడు కూడా సమాజం ఇలానే ఉంటుంది అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అని దీప అనడంతో మోనిత భయంతో వణికిపోతుంది. ఇది మా హాస్పిటల్ ఇక్కడి నుంచి వెళ్తావా… లేక స్టాఫ్ చేత బయటకు గెంటిచమంటావా అని దీప అనడంతో మోనిత అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

దీప రోషిని ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో రోషిని భోజనానికి వెళుతుండటంతో.. కూర్చో దీప భోజనం చేశాక మాట్లాడదామంటుంది. నేను వడ్డిస్తాను మేడమ్ మీరు భోజనం చేయండి భోజనం చేస్తూ మాట్లాడదాం…అని దీప అనడంతో నువ్వు భోజనం వడ్డిస్తే నీ వైపు మాట్లాడతా అనుకుంటున్నావా అని రోషిని అంటుంది. ఈ క్రమంలోనే దీప ఆనందరావు విషయంలో మోనిత చేసిన పనిని వివరిస్తుంది. మోనిత గురించి మీకు తెలియాలనే ఇదంతా చెబుతున్నాను అని చెప్పడంతో నాకు తెలుసు దీప కానీ …మీ ఆయన కూడా తప్పు చేశాడు. కానీ ఇప్పుడు నాకేం తెలియదు అంటూ మరింత తప్పు చేస్తున్నాడని అంటుంది. ఈ లోగ అంజి టాపిక్ తీసుకువస్తుంది. ఎంక్వైరీ చేశాను దీప అంజి వైజాగ్ లో లేడు.. అంజి దొరకకపోతే ఇప్పుడెలా మేడం అని దీప అంటుంది.

అంజి ఎలాంటివాడు దీప అని రోషిని అడగడంతో మంచివాడని దీప చెబుతుంది. మంచివాడైతే మర్డర్ ఎందుకు చేస్తాడు?నీ భర్తను కూడా మంచివాడు అంటున్నావ్…మంచివాడైతే నిన్ను ఆ చిన్న ఇంట్లో ఎందుకు ఉంచుతాడు?ఎదుటి వారిలో మంచి కాకుండా చెడును కూడా ఆలోచించు దీప అని రోషిని చెప్పడంతో అవును మేడమ్ మీరు చెప్పారు కదా ఆలోచిస్తున్నాను అంటూ మీకు ఒక ఒక విషయం చెప్పాలని దానికి రోషిని చొప్పు అనడంతో దీపా ఏదో చెబుతుంది. ఓకే దీప అలాగే చేద్దామని రోషిని చెబుతుంది. కట్ చేస్తే మోనిత అసలు ఈ వంటలక్కకు ఇంత తెలివితేటలు ఎక్కడినుంచి వచ్చాయి…ఇలా ఆలోచిస్తూ ఉంది. ఇది ఇలా చేస్తుందనుకుంటే దానికి చెప్పకుండా కార్తీక్ ను ఎలాగో పెళ్లి చేసుకొనేదానని మనసులో అనుకుంటుంది.

అసలు అంజి గాడు సేఫ్ గా మన వాళ్ల దగ్గరే ఉన్నాడు గా.. అంటూ ఎవరికి ఫోన్ చేస్తుంది. అటు నుంచి వాళ్ళు మేము మీకు ఫోన్ చేద్దాం అనుకున్న మేడమ్… అంజి మూడు రోజుల నుంచి కనపడడం లేదని చెప్పడంతో మోనిత షాక్ అవుతుంది.ఆ తర్వాత దీప ఇంట్లో అందరూ కలిసి కూర్చొని ఉండగా మోనిత విషం కలిపిన నీళ్లు తీసుకెళ్లి బెదిరిస్తోంది. మోనిత బెదిరించడంతో దీప తాగు విషం కలిపిన నీళ్లు తాగు అంటూ మోనితను బెదిరిస్తుంది. పోనీ నేను తాగనా? అంటూ బాటిల్ మూత తీసి దీప విషం కలిపిన నీళ్లు తాగుతుంది. ఆ తరువాత దీపకు ఏమవుతుంది ?అనే విషయం తెలియాలంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.