Categories: FeaturedMovie News

వయసు పెరిగినా తీరు మారలేదంటూ.. సుమ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి !

బుల్లితెరపై అన్ని చానల్లో తనదైన రీతిలో వివిధ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతున్న యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అందరు టక్కున సుమ పేరు చెబుతారు.గత రెండు దశాబ్దాల కాలం నుంచి టెలివిజన్ రంగంలో దూసుకుపోతున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమ ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.సుమ వ్యవహరించే అన్ని కార్యక్రమాలలో కెల్లా అత్యధిక రేటింగ్స్ లో దూసుకుపోతున్న కార్యక్రమం క్యాష్ ఒకటి అని చెప్పవచ్చు.

తాజాగా ఈ వారం ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ వారం ఈ కార్యక్రమానికి సీనియర్ సెలబ్రిటీలు బాబు మోహన్, గౌతమ్ రాజు, రాజ్యలక్ష్మి, శివ పార్వతిలతో కలిసి సుమ క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చారు. ఏ కార్యక్రమంలోనైనా సుమ వచ్చే గెస్ట్ ల పై పంచులు వేయడం సాధారణమే. కానీ ఈ మధ్యకాలంలో కార్యక్రమానికి వచ్చిన గెస్ట్ లు సైతం సుమ పై పంచులు వేయడంతో కార్యక్రమం ఎంతో సరదాగా సాగిపోతోంది.

ఇక ఈ వారం ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన గెస్ట్ లు యాంకరమ్మకు సరైన రీతిలో పంచులు వేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా సినీనటి రాజ్యలక్ష్మి సుమ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.ఈ క్రమంలోనే రాజ్యలక్ష్మి షోకి అదిరిపోయే స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చారు.

సుమ ఈరోజు నాకు కాంపిటీషన్ గా మీరు తయారయ్యి వచ్చారు అంది. దీంతో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ… నిన్ను చూస్తే నాకు చాలా అసూయగా ఉంది… మేము మా చిన్నప్పుడు ఇలా లంగావోణీలు వేసాము.. కానీ నువ్వు ఇంకా అవే వేస్తున్నావు అంటూ ఆమె గురించి కామెంట్ చేశారు. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ ఈ మాటకు అర్థం ఏంటి? నాకు వయసు పెరిగినా ఇంకా ఇలాగే లంగా వోణీలు వేసుకుంటున్నాను అనుకుంటున్నారా.. అని ప్రశ్నించడంతో అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago