Varalakshmi: పెళ్లయిన వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరలక్ష్మి.. ఇదేం ట్విస్ట్ అంటూ?

Varalakshmi: వరలక్ష్మి శరత్ కుమార్ సినీ ఇండస్ట్రీలో లేడీ విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి వరలక్ష్మి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. కెరియర్ మొదట్లో హీరోయిన్గా నటించిన వరలక్ష్మి ప్రస్తుతం మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. నికోలయ్ సచ్‌దేవ్ అనే ఓ ఆర్ట్ గ్యాలరిస్టుని నిశ్చితార్థం చేసుకుంది. దీంతో అందరూ ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేశారు అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే నికోలయ్ కి ఇది మొదటి వివాహం కాదని ఇది తనకు రెండో వివాహం అని తెలుస్తుంది. ఈయన ఇదివరకే వివాహం చేసుకున్నారు. తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. ఈయన ఇదివరకు కవిత అనే ఒక మోడల్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా కలరు అయితే వీరిద్దరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

పెళ్లి జరిగి పిల్లలు ఉన్నారా..

ఈ విధంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం తనకు వరలక్ష్మితో పరిచయం ఏర్పడిందని ఇలా 14 సంవత్సరాల పాటు పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.