కరోనా సమయంలో వీటిని తినడం ఎంతో ముఖ్యం..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అది మొత్తం మన జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది. మన జీవన విధానంలో కలిగే మార్పుల వల్ల మన ఆరోగ్యం ఎలా ఉంటుంది అనే విషయం ఆధారపడి ఉంటుంది.ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల కన్నా అధికంగా రుచి కలిగిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంచి ఆహారాన్ని పక్కనపెట్టి ఫాస్ట్ ఫుడ్ లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మన శరీరం ఎన్నో విలువైన పోషకాలను కోల్పోతుంది.

ఇక తాజాగా కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చుట్టుముట్టడంతో తిరిగి చాలామంది ఆహార విషయంపై శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలోనే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవటం.అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టత చూపుతున్నారు. మరి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

జింక్: కరోనా రాకముందు వరకు అసలు జింక్ గురించి పెద్దగా ఎవరు అడిగేవారు కాదు. అయితే కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో జింక్ తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే జింక్ కలిగినటువంటి ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి. జింక్ మనకు అధికంగా పాలు, పాల ఉత్పత్తులు గుడ్లు మాంసం గింజలు వంటి ఆహార పదార్ధాలలో అధికంగా లభిస్తుంది. తరచూ ఈ విధమైనటువంటి ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల జింక్ పుష్కలంగా లభిస్తుంది. అదేవిధంగా జింకును మనం సప్లిమెంట్ల రూపంలో కూడా పొందవచ్చు.

విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలు:

మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే తప్పనిసరిగా అధిక శాతం విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో తగినంత రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు. అయితే విటమిన్ ఏ, బి, సి, డి ,కే వంటివి వివిధ రకాల తాజా పండ్లను, పప్పు ధాన్యాలను, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని అధికంగా తీసుకోవటం వల్ల ఈ విధమైనటువంటి విటమిన్లను మనం పొందవచ్చు. ఇలాంటి ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల కరోనా బారిన పడ్డ ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా ఉండవచ్చు.