Vijay Devarakonda: నెగిటీవిటీ ఎదుర్కోలేకపోతే ఇంటికి వెళ్ళిపో.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఉన్నటువంటి నెగెటివిటీ గురించి విజయ్ దేవరకొండకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఈయన సమాధానాలు చెబుతూ…

నేను హీరో కావాలని ఎవరు కూడా చెప్పలేదు నేనే హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చాను అలాంటప్పుడు ఇక్కడ నన్ను ప్రశంసించిన తిట్టిన వాటిని నేను సమానంగా తీసుకోవాలని ఈయన తెలిపారు. ఈ ప్రపంచంలో ఒక మనిషిని మాత్రమే కాదు గాంధీజీ వంటి గొప్ప నాయకుడిని మోడీ వంటి గొప్ప రాజకీయ వేత్తను ఎందుకు దేవుడిని కూడా తిడతారు తిట్టడమే వాళ్ళ పని అని విజయ్ వెల్లడించారు.

సమాజంలో ఒక భాగం..
ఇలా ఏదైనా ఒక పని చేసేటప్పుడు వచ్చినటువంటి విమర్శలను ఎదుర్కొని మనం ముందుకు వెళ్లాలి ఎప్పుడైతే ఇలాంటి విమర్శలను మనం ఎదుర్కోలేదు ఆ క్షణమే ఇంటికి వెళ్లిపోవచ్చు నిన్ను ఎవరు కూడా అడ్డుకోరుని ఆ స్థానంలో మరో హీరో వస్తారు. ఇలా నెగిటివిటీ అనేది ఈ సమాజంలో ఒక భాగం అంటూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.