Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు ఎంతో పోటీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఇటీవల సోషల్ మీడియా ఫెడరేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవితో పాటు నటుడు విజయ్ దేవరకొండ కూడా హాజరై సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ తమ మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చిరంజీవి నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పది సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి గానే ఉంటాను ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు షాంపూ అయిపోతే ఆ బాటిల్ నీళ్లు వేసుకొని షాంపూ చేసుకుంటాను ఇలా మీలో కూడా ఏదైనా మిడిల్ క్లాస్ లక్షణాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ ఆ షాంపు బాటిల్ లోకి నీళ్లు పోసుకుని చాలాసార్లు షాంపు చేసుకున్నాను అంటూ ఈయన కూడా తన మిడిల్ క్లాస్ లక్షణాలను బయటపెట్టారు. అంతేకాకుండా ఇంట్లో ఎక్కడ ఏ లైట్ ఆన్ లో ఉన్న నేను వాటన్నింటిని ఆఫ్ చేస్తూ ఉంటాను. ఇక చరణ్ ఏదైనా వెకేషన్ వెళితే తన ఫ్లోర్లో కనీసం రెండు మూడు లైట్లు అలాగే వెలుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ నేనే ఆపి వేస్తాను.
పొదుపు అవసరం…
కేవలం లైట్లు మాత్రమే కాకుండా ఇంట్లో ఎక్కడైతే గ్లీజర్స్ ఆన్ లో ఉంటాయి లేదంటే ఫాన్స్ ఆన్ లో ఉంటాయో వాటి అన్నింటిని ఆన్ ఆఫ్ చేయడానికి నా మొబైల్లో ఒక యాప్ ఉందని ఆ యాప్ ద్వారా అన్నింటిని చెక్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటానని తెలిపారు. నేను ఎన్ని కోట్లు సంపాదించినా ఇలాంటి విషయాలలో మిడిల్ క్లాస్ వ్యక్తిగానే ఆలోచిస్తానని పొదుపు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అంటూ చిరు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…