Vijaya Chamundeswari : అలనాటి మహానటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి హోమ్ టూర్.. సావిత్రి గారి జ్ఞాపకాలతో…!

Vijaya Chumundeswari : అలనాటి తార సావిత్రి గారు హీరోలకు ధీటుగా ఎదిగిన స్టార్. సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలానికే అగ్ర హీరోయిన్ గా ఎదిగి ఇప్పటికీ ఎంతో మందికి నటనలో బెంచ్ మార్క్ సెట్ చేసిన మహానటి. ఆమె వెండితెర మీద ఒక వెలుగు వెలిగినా నిజ జీవితంలో మాత్రం ఓడిపోయింది. భర్త వల్ల, నమ్మిన వారు మోసం చేయడం వల్ల ఆర్థికంగానూ చితికిపోయి అలానే మానసికంగానూ క్రుంగిపోయి మరణించారు. ఆమె జీవిత కథను ‘మహానటి’ గా సినిమా తీసి అలాంటి ఆ మహనటి గురించి ఈ తరం వారికి తెలియజేసారు. ఇక సావిత్రి గారి కూతురు విజయ చముండేశ్వరి గారు సావిత్రి గారి జ్ఞాపకాలను తన ఇంట్లో భద్రపరుచుకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు.

మహానాటి జ్ఞాపకాలతో…

చెన్నై లో అపార్ట్మెంట్ లో నివసిస్తిన్న విజయ చాముండేశ్వరి గారు తన ఇంట్లో తన అమ్మ జ్ఞాపకాలను పదిలపరుచుకున్నారు. ఇటీవల యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇల్లు అలానే సావిత్రి గారి ఫోటోలను చూపించారు చాముండేశ్వరి. సావిత్రి గారు నగలను స్వయంగా డిజైన్ చేసి చేయించుకునేవారని సినిమాలలో దాదాపుగా ఆమె నగలనే వాడేవారని విజయ చెప్పారు. సావిత్రి గారికి ట్రెడిషనల్ గా ఉండటం అంటే చాలా ఇష్టమని, ఎపుడూ మంచి పట్టు చీర కట్టుకుని జడలో ఎక్కువ మల్లెపూలు పెట్టుకునేది అంటూ చెప్పారు విజయ చాముండేశ్వరి.

ఇక తన అమ్మ ఇచ్చిన అలనాటి చెక్కతో చేసిన ఒక పెట్టెను చూపించారు. ఆ పెట్టె తన అమ్మమ్మ దగ్గరి నుండి సావిత్రి గారికి వచ్చిందని తన అమ్మ తనకు ఇచ్చారని చెప్పారు. పెళ్లి సమయంలో ఆ పెట్టె నిండా వెండి సామాను, బంగారం పెట్టి ఇచ్చారట సావిత్రి గారు. ఇక ఆమె ఫోటోలను అలాగే తండ్రి జెమినీ గణేశన్ ఫోటోలను ఎంతో చక్కగా అలంకరించుకున్నారు. వారిరువురి పేరు మీద పోస్టల్ స్టాంప్ రావడంతో ఆ పోస్టల్ స్టాంపుల ఫోటోలను చాముండేశ్వరి గారి అబ్బాయి కాఫీ మగ్గు మీద వేయించి గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇలాంటి విశేషాలతో మహానటి గారి అరుదైన జ్ఞాపకాలను పంచుకున్నారు విజయ చాముండేశ్వరి.