మత్స్యకారుడి వలలో లక్షలు విలువ చేసే చేప… ఈ చేప ప్రత్యేకత ఏమిటంటే?

సాధారణంగా మత్స్యకారులు చేపల వేట నమ్ముకుని బతుకుతుంటారు.అయితే వేటకు వెళ్ళిన సమయంలో కొన్నిసార్లు మత్స్యకారులకు తీవ్ర నిరాశ ఎదురవుతూ ఉంటుంది.అదే విధంగా మరి కొన్నిసార్లు అదృష్టం తలుపు తట్టినట్టు ఎంతో అరుదైన చేపలు వలలోకి పడటంతో ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు ఇదివరకు ఎన్నో జరిగాయి. తాజాగా ఇలాంటి ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన కృష్ణాజిల్లా మత్స్యకారుల వలలో అరుదైన చేపలు పడ్డాయి. కచిలి చేపలి అనే 16 కిలోల మగ చేప, 15 కిలోల ఆడచేప దొరకడంతో మత్స్యకారులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మత్స్య కారులు ఆ చేపను ఫిషింగ్ హార్బర్ కు తీసుకువచ్చారు.

ఈ అరుదైన చేపల కోసం ఫిషింగ్ హార్బర్ లో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.మార్కెట్లో ఒక చేప లక్ష రూపాయల పైగా ధర పలకగా లక్షలోపు ధర పలకడంతో ఒక్కసారిగా లక్షాధికారిగా మారిపోయాడు. ఎంతో ఖరీదు చేసే ఈ చేప ఎక్కువగా మందుల తయారీకి ఉపయోగించడం వల్ల వీటికి అధిక డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా ఈ చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో ఈ చేపలు అధిక ధర పలకడం విశేషం.