అడవిలో పాములు కనిపించడం అనేది సహజం. కానీ సూపర్ మార్కెట్ కు వెళ్లినప్పుడు పాము కనిపిస్తుందని ఎవరైనా ఊహిస్తారా. పైగా అది చిన్నది కూడా కాదూ… ఏకంగా 10 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ. అది వేగంగా పాకలేక… నెమ్మదిగా అక్కడే ఉంది. దానిని చూసిన వారు భయాందోళనకు గురయ్యారు. అక్కడ సామాన్ల నుంచి బయటకు వస్తూ కనిపించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని సూపర్ మార్కెట్ వద్ద జరిగింది. అక్కడ హెలెనా అల్లీ అనే ఓ మహిళ తన పిల్లల కోసం వాడే స్పైసెస్ డబ్బాల కోసం వెతుకుతుండగా… ఐటెమ్స్ మధ్యలోంచీ ముందుకొచ్చింది ఈ డైమండ్ పైతాన్ . దీన్ని చూడగానే హెలెనా ఉలిక్కి పడింది. వెంటనే మిగతా కస్టమర్లను ఆమె అలర్ట్ చేసింది. దీంతో కొందరు అక్కడ నుంచి బయటకు పరుగులు పెట్టారు.
మొదట్లో హెలెనా దానిని చూసినప్పుడు 8 అంగుళాల దూరంలోనే కనిపించింది. తర్వాత అది బయటకు వస్తూ పెద్దగా కనిపించింది. అయితే హెలెనాకు పాములు కొత్తేమి కాదు. ఆమె విషపూరితమైన పాముల్ని కూడా ఎలా పట్టుకోవాలో ట్రైనింగ్ కూడా తీసుకుంది. పాముని చూసినప్పుడు మొదట షాకైన ఆమె… ఆ తర్వాత వెంటనే కోలుకుంది. తనే స్వయంగా పామును వీడియో తీసింది. ఆమె కొన్నేళ్ల క్రితం సిడ్నీ వైల్డ్‌లైఫ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీలో పనిచేసిన అనుభవం ఉంది.
దీంతోనే ఆమె స్వయంగా ఓ సంచిలోకి ఆ పాము వెళ్లేలా చేసింది. అదంతా చూస్తున్న సూపర్ మార్కెట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అంత పెద్ద పామును ఆమె బంధించిన విధానం చూసి అందరూ ఆమెను మెచ్చకున్నారు. దీంతో ఆమె ఆ పామును తీసుకెళ్లి దగ్గరలోని అడవికి తీసుకెళ్లి వదిలేసింది. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ గా మారింది. అక్కడ ఆమె కస్టమర్లు కంగారు పడుతున్న క్రమంలో వారికి ధైర్యం చెబుతూ.. ఎవర్నీ ఏమి చేయదని చెప్పింది. దీంతో వాళ్లు కంగారు పడకుండా నెమ్మదించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి ప్రశంసిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…