Corona Variant: అందరిని భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి!

Corona Variant:ఎంతో ప్రశాంతంగా కష్టపడి పని చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ప్రపంచ దేశాల పై కరోనా వైరస్ పిడుగులా వచ్చి పడింది. ఈ క్రమంలోనే ఈ కరోనా మొదటి రెండు దశలలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలోనే మరణాల సంఖ్యను తగ్గించడం కోసం నిపుణులు ఎంతో శ్రమించి వ్యాక్సిన్ కనుగొన్నారు.

ఇలా ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారితో పోరాడుతూ ఉన్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం వేరియంట్లను మార్చుకుని ప్రతిసారీ తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ లో భాగంగా ఈ వైరస్ ఒమిక్రాన్ రూపంలో మరోసారి దేశ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.

అయితే ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే రెండు డోస్ ల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు సంభవించక పోవడంతో ప్రతి ఒక్కరూ ఊపిరిపీల్చుకున్నారు.

చైనాలో సరికొత్త వేరియంట్..

ఇలా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి కరోనా నిబంధనలు పాటిస్తూ వారి జీవనంలో ముందుకు సాగుతున్న నేపథ్యంలో చైనా పిడుగులాంటి వార్తను తెలియజేసింది. చైనాలో సరికొత్త కరోనా వేరియంట్ ను గుర్తించినట్లు నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే నియోకోవ్‌ను అనే కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించినట్లు నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి మరణం ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.